India vs Pakistan in Asia Cup 2023: వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోరుకు ముందే భారత్-పాక్ జట్ల మధ్య ఆసియా కప్‌లో రెండు జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆగస్టు 31ను టోర్నీ ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూపు ఏ లో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉండగా.. గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఆసియా కప్ షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. అసలు ముసాయిదా షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధం చేసింది. ఈ టోర్నమెంట్ కోసం హైబ్రిడ్ మోడల్ ఆమోదించింది.
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న క్యాండీలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్థాన్, భారత్‌లు రెండూ సూపర్ ఫోర్ రౌండ్‌కు చేరుకుంటే.. సెప్టెంబర్ 10న మళ్లీ క్యాండీలో తలపడతాయి
తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. సెప్టెంబర్ 3న లాహోర్‌లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, సెప్టెంబరు 5న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌కు సన్నహాంగా అన్ని జట్లకు ఉపయోగపడనుంది.
ఆసియ కప్‌లో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. టీమిండియా అత్యధికంగా ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. శ్రీలంక 6 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. టీమిండియా చివరిసారిగా 2018 టైటిల్ విజేతగా నిలిచింది. 2022 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఛాంపియన్‌గా అవతరించింది. పాకిస్థాన్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook