Asia Cup Final 2023: ఆసియా కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4 లో సత్తాచాటిన భారత్, శ్రీలంక జట్లు ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం అనగా సెప్టెంబరు 17న భారత్, శ్రీలంక మధ్య టైటిల్ పోరు జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో దిగిన శ్రీలంక, మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. భారత్ కూడా టైటిల్ గెలిచి సమం చేయాలని చూస్తోంది.
8వ ట్రోఫీ కోసం భారత్..
1984లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు 7 సార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు 8వ సారి టైటిల్ ను నెగ్గి రికార్డు నెలకొల్పాలని యోచిస్తుంది. అయితే ఆసియా కప్ వేదికగా ఫైనల్ కు చేరిన రెండు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా.. ఇండియా 4 సార్లు, శ్రీలంక 3 సార్లు గెలిచింది. ఈ లెక్కను సమం చేయాలని లంక క్రికెటర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటని ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ కాన్సిల్ అయితే విజేతగా ఏ జట్టును ప్రకటిస్తారనే విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
శ్రీలంకలోని కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున దాదాపుగా 72 శాతం అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ వర్షం కారణం సెప్టెంబరు 17న జరిగే మ్యాచ్ కు ఆటంకం వాటిల్లితే ఆ తర్వాతి రోజు అనగా సెప్టెంబరు 18న రిజర్వ్ డేని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
Also Read: CM KCR at Palamuru project: నార్లాపూర్ పంప్ హౌజ్ వద్ద మహా బాహుబలి మోటార్స్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్
అయితే భారత్, శ్రీలంక జట్లు తలపడనున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే (సెప్టెంబరు 18)న కూడా 81 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ డే తో పాటు రిజర్వ్ డే కూడా వర్షం పడే సూచనలు ఉండడం వల్ల పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఆ రెండు రోజులు మ్యాచ్ నిర్వహించడం కష్టం అయితే మ్యాచ్ రద్దు అయినట్టే. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే విజేతగా ఎవర్ని ప్రకటిస్తారు అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.
ఇదే తొలిసారి కాదు..
ఒకవేళ ముందుగా అనుకున్న ఈ రెండు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలకపోతే.. 2023 ఆసియా కప్ టోర్నీ విజేతలుగా భారత్, శ్రీలంకలను ప్రకటిస్తారు. ట్రోఫీ ఈ రెండు జట్లు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా పంచుకోవడం ఇదే తొలిసారి కాదు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ లో కూడా ఈ రెండు జట్లు (భారత్, శ్రీలంక) తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు దేశాల జట్లను విజేతలుగా ప్రకటించారు.
ఆసియా కప్ ఫైనల్ జట్లు (అంచనా):
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
Also Read: Reasons Behind IND VS BAN Match Defeat: బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి వీళ్లే కారణమా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook