Team India: ఆసియా కప్ 2022 టీ20 టోర్నమెంట్ ముగిసింది. ఇండియా సూపర్ 4 నుంచే నిష్క్రమించింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ కొత్త టీమ్ ప్రకటించింది. ఆ టీమ్ కూర్పు ఎలా ఉందంటే..
ఆసియా కప్ 2022 లో టీమ్ ఇండియా వైఫల్యం తరువాత అందరి దృష్టీ టీ20 ప్రపంచ కప్‌పై పడింది. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈసారి కూడా టీమ్ ఇండియా తొలి మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్‌తో అక్టోబర్ 23వ తేదీన మెల్బోర్న్ వేదికపై తలపడనుంది.
ఆసియా కప్ 2022లో వైఫల్యం అనంతరం టీమ్ ఇండియపై భారీగా విమర్శలు వస్తున్నాయి. అదే జట్టుతో టీ20 ప్రపంచ కప్‌కు వెళితే మరోసారి పరాజయం తప్పదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా కప్ సూపర్ 4లో శ్రీలంక, ఇండియా చేతిలో పరాజయంతో ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో ఈసారి జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. కొంతమందిని స్టాండ్ బైగా ఉంచింది.
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అక్సర్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
మొహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్‌లు స్డాండ్‌బైలో ఉండనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook