Mohammad Shami: టీ20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టుపై విమర్శలు వస్తున్నాయి. టీమ్ ఇండియా జట్టుకు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని టాప్ 15లో లేకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
అక్టోబర్ నెల నుంచి టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 15 మంది సభ్యులతో పాటు మరో నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎంపీకపై విమర్శలు వెల్లువెత్తుుతున్నాయి. సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కీలకమైన పేస్ బౌలర్ మొహమ్మద్ షమీను టాప్ 15లో ఉంచకుండా స్టాండ్ బైలో ఉంచడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ విషయంపై బీసీసీఐ సెలెక్టర్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశాడు. మొహమ్మద్ షమీ టాప్ 15లో వచ్చేందుకు అవకాశాలున్నాయని..ప్రపంచకప్‌కు ఆడటం ఖాయమని చెప్పాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో జరగాల్సిన సిరీస్‌లో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బూమ్రాల్లో ఏ ఒక్కరు విఫలమైనా ఆ స్థానంలో మొహమ్మద్ షమీ వస్తాడన్నాడు.
పది నెలలుగా టీ20 క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్లనే మొహమ్మద్ షమి టాప్ 15కు దూరంగా ఉన్నాడన్నాడు. బీసీసీఐ సెలెక్టర్ వ్యాఖ్యలు ఇలా ఉంటే..మొహమ్మద్ షమీని దూరంగా పెట్టడం వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ హస్తముందనే ప్రచారం సాగుతోంది. 15వ ఆటగాడి ఎంపిక విషయంలో రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ మొహమ్మద్ షమీ మధ్య పోటీ వచ్చిందని..రోహిత్ శర్మ..అశ్విన్ నే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా జట్టు
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర పటేల్, జస్ప్రీత్ బూమ్రా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బైలో
మొహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
Also read: Kohli vs Brett Lee: క్రికెట్‌కు కోహినూర్ కోహ్లీ, విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన బ్రెట్ లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook