CSK Vs GT IPL 2024 Updates: రుతురాజ్‌ Vs శుభ్‌మన్ గిల్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. నయా మలింగ ఎంట్రీ..!

CSK Vs GT Toss Updates and Playing 11: సొంతగడ్డపై మరో విజయంపై చెన్నై సూపర్ కింగ్స్ కన్నేసింది. నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టబోతుంది. టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పతిరణను చెన్నై జట్టులోకి తీసుకుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 26, 2024, 07:32 PM IST
CSK Vs GT IPL 2024 Updates: రుతురాజ్‌ Vs శుభ్‌మన్ గిల్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. నయా మలింగ ఎంట్రీ..!

CSK Vs GT Toss Updates and Playing 11: చెపాక్ స్టేడియం కీలక మ్యాచ్‌కు వేదికైంది. చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు జరుగుతోంది. తమ తొలి మ్యాచ్‌లో రెండు జట్లు కూడా విజయంతో ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఆర్‌సీబీని చెన్నై ఓడించగా.. ముంబైను ఆర్‌సీబీ చిత్తు చేసింది. ఇద్దరు యువ సారథులు రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ తుది జట్టులో ఒక మార్పు చేసింది. తీక్షణ స్థానంలో నయా మలింగ పతిరణను తీసుకున్నారు. ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే సీఎస్‌కే ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతోంది. 

Also Read: Game Changer: గేమ్ చేంజర్ గురించి షాకింగ్ అప్డేట్.. ఇది పాన్ ఇండియా సినిమా కాదంట!

"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో మేము శారీరకంగా, మానసికంగా అలసిపోయాం. 10 జట్లు ఆడటంతో అందరూ బాగా విశ్రాంతి తీసుకున్నారు. మ్యాచ్‌ల మధ్య తగినంత విశ్రాంతి తీసుకుంటాం. ముంబైపై మన బౌలర్లు పుంజుకున్న తీరు జట్టు స్వభావాన్ని చూపుతుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం.." అని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

టాస్ గెలిచి ఉంటే.. మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. వికెట్ కష్టంగా ఉంది. ఈ పిచ్ మొదటి మ్యాచ్‌ను పోలి ఉంది. ఆర్‌సీబీతో సరైన ఆరంభం లభించకపోయినా.. మేము బాగా పుంజుకున్నాం. ఇన్నింగ్స్ ఆద్యంతం అందరూ మంచి ప్రదర్శన చేశారు. తీక్షణ స్థానం మా మలింగ పతిరణ జట్టులోకి వస్తాడు.." చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్
మతీషా పతిరణ (ఇంపాక్ట్ ప్లేయర్‌)

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News