దీపిక పదుకొనే, ధోనీతో స్టెప్పులేసింది. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, బ్రావోలతో క్రికెట్ లీగ్ గీతాలకు దీపిక పదుకొనే డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, క్రికెటర్లు బాలీవుడ్ అందాల భామతో స్టెప్స్ వేయడం చూడవచ్చు.
కెరీర్ ప్రారంభంలో దీపికా.. ధోనీతో ప్రేమాయణం నడిపిందని..ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని, లవ్‌లో మునిగిపోయారని.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.
ఎంఎస్ ధోనీ హ్యాపీగా సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప కూడా పుట్టింది. తాజాగా దీపికా.. ఇప్పుడు బాయ్ ప్రెండ్ రణ్వీర్ సింగ్‌తో ప్రేమాయణం నడుపుతుందని.. వీరిద్దరి వివాహం త్వరలో జరగనుందని కథనాలు వెలువడుతున్నాయి.
దీపిక తల్లిదండ్రలు పెళ్లి డేట్ కూడా ఖరారు చేసినట్టు.. ఈ ఏడాది వారి వివాహం జరగనున్నట్లు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీపికా తన తల్లి, చెల్లితో కలిసి పెళ్లి షాపింగ్ చేస్తోందని వినికిడి. కానీ జంట ఈ ఊహాగానాలను ఖండించింది. కాగా.. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ‘గుల్లీ బాయ్’, రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న సింబా చిత్రాల్లో రణ్వీర్ నటిస్తున్నాడు.
ఇటీవల దీపికా 16వ శతాబ్దానికి చెందిన సూఫీ కవి యొక్క పద్యం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిన చిత్రం 'పద్మావత్' లో నటించి విమర్శకుల ప్రశంసలను పొందింది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ నటించారు.