Virat Kohli - Gautam Gambhir: విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఉన్నా.. లేకున్నా ఒకటే! పరుగుల వరద పారిస్తాడు: గంభీర్

కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీపై ఎలాంటి ప్రభావం చూపదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. రానున్న మ్యాచులలో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 02:28 PM IST
  • విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఉన్నా.. లేకున్నా ఒకటే
  • విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు
  • భారత్ గర్వించే విధంగా విరాట్ కోహ్లీ పరుగులు చేస్తాడు
 Virat Kohli - Gautam Gambhir: విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఉన్నా.. లేకున్నా ఒకటే! పరుగుల వరద పారిస్తాడు: గంభీర్

Gautam Gambhir says I am sure Virat Kohli is going to make Team India proud: కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఎలాంటి ప్రభావం చూపదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అన్నారు. రానున్న మ్యాచులలో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు. భారత్ గర్వించే విధంగా పరుగులు చేస్తాడని గౌతీ పేర్కొన్నారు. టీమిండియా పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు అప్పగించిన నేపథ్యంలో ఇకపై విరాట్‌ కేవలం టెస్టులకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పినపుడే వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని విరాట్ ప్రకటించినప్పటికీ.. బీసీసీఐ (BCCI) సెలక్టర్లు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే సారథిగా ఉండాలని కోహ్లీకి ఉద్వాసన పలికారు. 

తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ షో 'ఫాలో ది బ్లూస్'లో గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) మాట్లాడుతూ... 'రెడ్ బాల్ క్రికెట్ అయినా లేదా వైట్ బాల్ క్రికెట్ అయినా.. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటను భారత్ చూస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కోహ్లీకి కెప్టెన్సీ ఉన్నా.. లేకున్నా ఒకటే. ఎప్పటిలానే అతడు పరుగుల వరద పారిస్తాడు. కోహ్లీకి క్రికెట్ ఆటపై ఉన్న ఫ్యాషన్, ఎనర్జీ ఎప్పుడూ పోదు. భారత్ గర్వించే విధంగా అన్ని ఫార్మాట్‌లలో పరుగులు చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని అన్నారు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మ పాత్ర ఎలాగో.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో కోహ్లీ పాత్ర అలాగ అని గౌతీ అభిప్రాయపడ్డారు. 

Also Read: దళిత యువకులపై దాష్టికం... గుంజీలు తీయించి,నేలపై ఉమ్మి నాకించిన వైనం...

ఇద్దరు వేర్వేరు సారథులు జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం అని బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అన్నారు. ఇద్దరు భిన్నమైన వ్యక్తుల (విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ)ల అభిప్రాయాలు, సూచనలు టీమిండియాకు కలిసివస్తాయి. కెప్టెన్సీ భారం లేకపోవడంతో విరాట్ కోహ్లీ మరింత ప్రమాదకర బ్యాటర్‌గా మారతాడు. ముఖ్యంగా టీ20, వన్డేలలో బ్యాట్‌ ఝులిపించగలడు' అని గంభీర్‌ చెప్పుకొచ్చారు. గత రెండేళ్లుగా విరాట్ ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. దీంతో అతడు ఎప్పుడెప్పుడు సెంచరీ బాదుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ కల త్వరలోనే నెరవేరుతుందని గంభీర్‌ జోస్యం చెప్పారు.

Also Read: Babar Azam: అప్పుడు విరాట్ కోహ్లీతో ఏం మాట్లాడానో అస్సలు చెప్పను.. అదో పెద్ద సీక్రెట్: బాబర్

ఈ వారంలో  దక్షిణాఫ్రికా టూర్‌ (South Africa Tour)కు భారత్ వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. కరోనా నిబంధనల కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు టీమిండియా క్రీడాకారులు మూడు రోజుల పాటు ముంబైలో క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కి క్రీడాకారులు చేరుకున్నారు. తొలి టెస్టు మ్యాచ్‌ డిసెంబర్‌ 26 సెంచూరియన్‌ వేదికగా ఆరంభం కానుంది. టెస్ట్ జట్టుకు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సారథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంటాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News