T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించింది ప్రముఖ ఓటీటీ సంస్థ.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 04:33 PM IST
T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?

T20 World Cup 2024 live Streaming: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 01 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ జూన్ 29న ముగుస్తుంది. తొలి మ్యాచ్ అమెరికా, కెనడాల మధ్య జరగనుంది. జూన్ 05న టీమిండియా తన మెుదటి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో ఆడనుంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసే దాయాదుల మధ్య పోరు జూన్ 09న న్యూయార్క్ సిటీలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా వీక్షించే బంపర్ ఆఫర్ కొట్టేశారు అభిమానులు. ఈ అవకాశాన్ని డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కల్పించనుంది. టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ లను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఫ్రీగా ప్రసారం చేయనుంది. దీంతో క్రికెట్ అభిమానులు పుల్ ఖుషీగా ఉన్నారు. 2023 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లను కూడా హాట్ స్టార్ ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ఈసారి జరగబోయే టీ20 ప్రపంచకప్ లో మునుపెన్నడూ లేని విధంగా 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. మెుత్తం 10 వేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో, మరో ఐదు వేదికలు కరేబియన్ దీవుల్లో ఉండనున్నాయి. యూఎస్ లోని 5 వేదికలను ఇప్పటికే ఐసీసీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాతోపాటు మోరిస్ విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడార్ హిల్ లో ఈ మ్యాచ్ లు జరగబోతున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీలో మెుత్తంగా 55 మ్యాచ్ లు జరగనున్నాయి. అమెరికాలో 16 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సూపర్-8 మ్యాచ్ లతోపాటు ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. ఈసారి 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. అక్కడ టాప్ లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్ కు చేరుతాయి. 

Also Read: IPL 2024: చెన్నైకు భారీ షాక్.. ఐపీఎల్‌ మొదలుకాకముందే విధ్వంసక బ్యాటర్ దూరం..

Also Read: IPL 2024: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ఖాయమేనా, ప్యాట్ కమిన్స్ దశ మార్చనున్నాడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News