Rashid Khan Heroic Knock Gujarat Titans beat Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటన్స్ ఊహించని విజయాన్ని అందుకుంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చివరి చివర్లో మూడు సిక్సులు బాది గుజరాత్‌కు సూపర్ విక్టరీ అందించాడు. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ చివరి బంతికి ఛేదించింది. వృద్ధిమాన్ సాహా (68) హాఫ్ సెంచరీ చేయగా.. రాహుల్ తెవాటియా (40), రషీద్ ఖాన్ (31) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఉమ్రాన్ మాలిక్ ఐదు వికెట్లు తీసినా.. ఫలితం లేకుండా పోయింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు వృద్ధి మాన్ సాహా (68), శుభ్‌మన్ గిల్ (22) శుభారంభం అందించారు. సాహా బౌండరీలు బాదుతుంటే.. గిల్ మాత్రం నిదానంగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు చేశారు. అయితే ఉమ్రాన్ మాలిక్ వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. గిల్ సహా హార్దిక్ పాండ్యా (10), సాహా, డేవిడ్ మిల్లర్ (17), అభినవ్ మనోహర్ (0) విఫలమయ్యారు.
ఇక గుజరాత్ ఓటమి ఖాయం అనుకున్న సమయంలో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ముందుగా తెవాటియా భారీ షాట్లతో విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో.. తెవాటియా ఓ సిక్స్ బాధగా, రషీద్ మూడు సిక్సర్లు బాది జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 199 పరుగులు చేసి విజయం అందుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే వికెట్లు తీశాడు.
WHAT. A. GAME! 👌👌
WHAT. A. FINISH! 👍👍
We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌
Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38
— IndianPremierLeague (@IPL) April 27, 2022
అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (65), స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (56) అర్ధ శతకాలతో రాణించారు. ఇన్నింగ్స్ చివరలో శశాంక్ సింగ్ (25 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5), రాహుల్ త్రిపాఠీ (16), షింగ్టన్ సుందర్ (3), నికోలస్ పూరన్ (3) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో షమీ మూడు వికెట్లతో చెలరేగాడు.
Also Read: Anushka Shetty in Acharya: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఆచార‍్యలో స్టార్ హీరోయిన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.