India vs Australia 3rd T20 Uppal Stadium Tickets Prices: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకం ఆరంభం అయింది. హైదరాబాద్ జింఖానా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి టీ20 మ్యాచ్ టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారులు ఆరంభించారు. టికెట్ల కోసం అభిమానులు జింఖానా కౌంటర్ వద్ద బారులు తీరారు. టిక్కెట్ల కోసం ఫాన్స్ ఘర్షణ పడుతున్నారు. పోలీసులు వారిని అదుపుచేయలేకపోతున్నారు.
మూడో టీ20 మ్యాచ్ కోసం టికెట్స్ రేట్స్ భారీగానే ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. గతంలో మాదిరి రూ. 500 టికెట్స్ అమ్మడం లేదు. రూ. 850 నుంచి రూ. 10,000 వరకు ఉన్నాయి. టికెట్ కనీస ధర రూ. 850గా ఉంది. 2500, 5000, 7000, 10000 టికెట్స్ ప్రస్తుతం ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. ఫాన్స్ అందరూ రూ. 850 కోసం ఎగబడుతున్నారట. దాంతో రూ. 850 టికెట్స్ త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కరికి రెండు టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు. టికెట్ కొనాలనుకునేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి.
జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు రావడంతో పెద్ద సంఖ్యలో బుధవారం అభిమానులు జింఖానా మైదానానికి పోటెత్తారు. ఉదయం 7 గంటలకే ఫాన్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే గేట్లు మూసి ఉండటంతో అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. హెచ్‌సీఏ డౌన్ డౌన్, వెంటనే టిక్కెట్లు అమ్మాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో హెచ్‌సీఏ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని గురువారం టికెట్లు అమ్మనున్నట్లు తెలిపింది. పేటీఎం వేదికగా టిక్కెట్లు అమ్మినట్లు హెచ్‌సీఏ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. హెచ్‌సీఏలోని 216 క్లబ్‌లకు తలా 15 చొప్పున 3240 పాసులు వెళతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ సంస్థల సిబ్బందికి మొత్తం 9000 పాసులుగా వెళతాయి. ఇవన్నీ పోయినా ఇంకా 30000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 15న రాత్రి 8 గంటలకు ‘పేటీఎం’లో టిక్కెట్ల అమ్మకాలు మొదలవగా.. కొన్ని క్షణాల్లోనే అయిపోయాయి. ఆరోజు సుమారు 15,000 మాత్రమే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. మిగతా 15000 వేల టికెట్స్ ఏమయ్యాయని ఫాన్స్ ఆందోళనకు దిగారు. దాంతో హెచ్‌సీఏ దిగొచ్చింది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర..!
Also Read: కన్యారాశిలోకి శుక్రుడు.. మరో 2 రోజుల్లో ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook