Ravichandran Ashwin Rare Feat: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తన వందో టెస్టులో జీవితాంతం గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు ఈ సీనియర్ స్పిన్నర్. ధర్మశాల టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వందో టెస్టులో 5 వికెట్లు తీసిన రెండో భారత్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ కంటే ముందు ఈ ఫీట్ కుంబ్లే సాధించాడు. అశ్విన్ కంటే ముందు టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 2005లో శ్రీలంకపై 89 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. స్పిన్ దిగ్గజాలైన ముత్తయ్య మురళీధరన్, దివంగత స్పిన్నర్ షేన్ వార్న్‌లు సైతం వందో టెస్టులో ఐదు వికెట్లు తీశారు. మురళీధరన్ బంగ్లాదేశ్(6/54)పై , షేన్ వార్నన్ దక్షిణాఫ్రికా(6/161)పై తీశారు.
తొలి ఇండియన్ గా అశ్విన్..
దీంతో మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 36 సార్లు ఐదు వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 35 సార్లు అయిదు వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డును తాజాగా యశ్ బద్దలుకొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతడు అయిదు వికెట్లు 67 సార్లు తీశాడు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ 37 సార్లు ఈ ఫీట్ సాధించాడు. వీరద్దరి తర్వాత రిచర్డ్ హ్యాడ్లీతో సమానంగా అశ్విన్ మూడో స్థానంలోఉన్నాడు. ధర్మశాల టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(0), జాక్ క్రాలే(2) ఓలీ పోప్(19), బెన్ స్టోక్స్(2), బెన్ ఫోక్స్(8) వికెట్లును తీశాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 516 వికెట్లు ఉన్నాయి.
Also Read: IND vs ENG 5th Test: అశ్విన్ మ్యాజిక్.. ధర్మశాలలో చిత్తు చిత్తుగా ఓడిన ఇంగ్లండ్..
Also Read: Nidhhi Agerwal: అందాల నిధి ఓపెన్ చేసిన నిధి అగర్వాల్, హాట్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook