Salman Butt said Pakistan openers did not wear helmets in Indian pacers: టీమిండియా పేస్ బౌలింగ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో అంతగా పేస్ ఉండేది కాదని.. పాకిస్థాన్ బ్యాటర్లు సయీద్ అన్వర్, అమీర్ సోహైల్‌లు హెల్మెట్ లేకుండా ఆడేవారన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మాజీలు అందరూ దాయాదుల సమరం గురించి మాట్లాడుకుంటున్నారు. సల్మాన్ బట్ అప్పటి భారత బౌలింగ్‌న గుర్తుచేశాడు.
తాజాగా సల్మాన్ బట్ క్రిక్ బ్రిడ్జ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... 'గతంలో టీమిండియాకు మంచి పేసర్లు ఉండేవారు కాదు. పేస్ బౌలింగ్ చాలా వీక్‌గా ఉండేది. అందుకే పాకిస్థాన్ ఓపెనర్లు సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్‌లు హెల్మెట్ లేకుండా ఆడేవారు. క్యాప్‌ను పెట్టుకుని టీమిండియా బౌలర్లను ఆడేవారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో హెల్మెట్ లేకుండా ఆడటం సాధారణమే. ఓపెనర్లు కూడా హెల్మెట్ లేకుండా ఆడటమనేది చాలా రిస్క్. అయినా మా దిగ్గజ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను లైట్ తీసుకుని అలా ఆడేవారు' అని అన్నాడు.
'ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మెరుపులు మెరిపించిన రోజుల్లో.. ఆడమ్ గిల్‌క్రిస్ట్, సనత్ జయసూర్య, కలువితరణ వంటి హిట్టర్లు ఓపెనర్లుగా వచ్చి దూకుడుగా ఆడేవారు. అఫ్రిది కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేశాడు. తర్వాత అతనే తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నాడు. మిస్బా ఉల్ హక్ యుగం మొదలైన తర్వాత అఫ్రిది ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. రెండేళ్లు సారథిగా ఉండి కూడా ఓపెనర్‌గా రాలేదు. కెప్టెన్‌గా ఉండి కూడా.. తాను ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉన్నా అఫ్రిది రాలేదు' అని సల్మాన్ చెప్పాడు.
ఇక భారత పేస్ బౌలర్లపై సంచలన కామెంట్లు చేసిన సల్మాన్ బన్‌ను టీమిండియా ఫాన్స్ కామెంట్లతో ఆడుకుంటున్నారు. పాపులారిటీ కోసం, యూట్యూబ్ ఆదాయం పెంచుకోవడం కోసమో ఇలాంటి చెత్త వాగుడు వాగొద్దు అని మండిపడుతున్నారు. సల్మాన్ పాకిస్తాన్ తరపున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20లు ఆడాడు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధంకు గురయ్యాడు. 2015లో నిషేధం నుంచి బయటపడ్డ సల్మాన్ దేశవాలీ టోర్నీలో ఆడాడు.
Also Read: India Asia Cup Final: మెరిసిన షఫాలీ, దీప్తి.. ఆసియా కప్ 2022 ఫైనల్ చేరిన భారత్!
Also Read: పాకిస్తాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది సజీవదహనం! వరదలు వదిలేసినా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook