Virat Kohli 38 Runs Away From Joining Sachin Tendulkar Elite List: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రోజుల్లో తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. మొహాలిలో శుక్రవారం నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచే కోహ్లీకి వందోది. దాంతో టీమిండియా తరపున టెస్టుల్లో వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా విరాట్ నిలవనున్నాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో రికార్డుల కింగ్ కోహ్లీని ఒక రికార్డు ఊరిస్తుంది.
వందో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ మరో 38 పరుగులు చేస్తే.. టెస్ట్ క్రికెట్‌లో 8 వేల పరుగులు చేసిన ఆరో టీమిండియా ఆటగాడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో భారత దిగ్గజాలు సచిన్ టెండ్యూలర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,288), సునీల్ గవాస్కర్ (10,122), వీరేంద్ర సెహ్వాగ్ (8,586), వీవీఎస్ లక్ష్మణ్ (8,781) మాత్రమే విరాట్ కంటే ముందున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ దాపుగా 16 వేల పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అతడిని దాటడం ఎవరివల్ల కాకపోవచ్చు.
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో శ్రీలంకతో జరగనున్న తొలి ఇన్నింగ్స్‌లోనే 38 పరుగులు చేస్తే.. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (168 ఇన్నింగ్స్‌ల్లో) ఎనిమిది వేల పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. సచిన్ టెండ్యూలర్ 154 ఇన్నింగ్స్‌లలో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ద్రవిడ్ (158 ఇన్నింగ్స్‌లు), సెహ్వాగ్ (160 ఇన్నింగ్స్‌లు), గవాస్కర్ (166 ఇన్నింగ్స్‌లు), లక్ష్మణ్ (201 ఇన్నింగ్స్‌లు) వరుసగా ఉన్నారు.
గత 2-3 ఏళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్ సహా అన్నింట్లోనూ కలిపి కింగ్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండున్నరేళ్లు అయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో అయినా సెంచరీ బాదాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆశిస్తున్నారు. 100వ టెస్టులో 100 పరుగులు చేస్తే బాగుంటుందని ఫాన్స్ అంటున్నారు. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టుల్లో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 254 నాటౌట్. టెస్టుల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 55.7గా ఉండగా.. యావరేజ్ 50.4గా ఉంది.
Also Read: Rohit Sharma Challenge: ఈ ఛాలెంజ్ గెలవండి.. రోహిత్ శర్మతో లైవ్‌లో మాట్లాడే అవకాశం పొందండి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook