Ind vs SL 3rd Odi Match Preview: ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. టీమిండియా ఇప్పటికే 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ స్ట్రెంత్‌ను ప్రయత్నించే మంచి అవకాశం ఉంది. మరోవైపు ఈ వన్డేలో విజయం సాధించి.. క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోవాలని శ్రీలంక చూస్తోంది.
తొలి మ్యాచ్‌లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో కూడా భారత జట్టుదే పైచేయి కనిపిస్తోంది. టీమిండియా బ్యాటింగ్‌లో మంచి డెప్త్ ఉంది. బౌలర్లు కూడా తమ పనిని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్ శనివారం ప్రాక్టీస్‌లో కనిపించలేదు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. యజువేంద్ర చాహల్‌కు అవకాశం లభిస్తుందా లేదా అనేది టాస్ సమయంలోనే తేలనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సిరాజ్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉంది.
రోహిత్ శర్మ దూరమైతే.. హార్ధిక్ పాండ్యా తొలిసారి వన్డే టీమ్‌కు నాయకత్వం వహిస్తాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు. వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగోస్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. ఆ తరువాత స్థానాల్లో కేఎల్ రాహుల్, పాండ్యా రానున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్‌ను పరీక్షించవచ్చు.
తిరువనంతపురం పిచ్ పై ఇది రెండో వన్డే. ఇంతకు ముందు ఈ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు విండీస్ జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ టార్గెట్‌ను టీమిండియా ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలో కచ్చితంగా కొంత తగ్గుదల ఉంటుంది. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు.
తుది జట్లు (అంచనా):
టీమిండియా: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/చాహల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ద, నువానిందు ఫెర్నాండో, ధనంజయ్ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, దునిద్ వెలాల్గే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార.
Also Read: SBI Loan Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త.. జీతాల పెంపు ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి