VVS Laxman to Head Coach Team India On Zimbabwe ODI Tour: మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 18 నుంచి భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ పర్యటనలో ఇప్పటికే కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జింబాబ్వే సిరీస్‌కు ముందుగా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా.. తాజాగా గబ్బర్ స్థానంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ సెలెక్టర్లు సారథిగా ఎంపిక చేశారు. టీమిండియా కెప్టెన్సీ తర్వాత మరో మార్పు కూడా జరిగింది.
జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఈ నిర్ణయానికి అసలు కారణం ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2022 టోర్నమెంట్. ఈ మెగా టోర్నీ కోసం భారత్ ఆగస్టు 23న యూఏఈకి బయలుదేరుతుంది. జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆగస్టు 22న ముగుస్తుంది. జింబాబ్వే సిరీస్‌కు, ఆసియా కప్‌కు మధ్య తక్కువ వ్యవధి ఉన్నందునే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్ 2022 జట్టులో ఎంపికైన చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు జింబాబ్వే సిరీస్‌కు విశ్రాంతిని ఇచ్చారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా విరామం తీసుకోవడం లేదు. అందుకే వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఐర్లాండ్‌కు వెళ్లిన భారత జట్టుకు కూడా లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక రెండు టీమ్‌లలోనూ ఉన్న ఇద్దరు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, దీపక్ హుడా హరారే నుంచి నేరుగా దుబాయ్ వెళతారు.
జింబాబ్వేకు వెళ్లే భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్.
ఆసియా కప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.
Also Read: Asia Cup 2022: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. రోహిత్ శర్మకు అతడే సరైన జోడి: కనేరియా
Also Read: Shikhar Dhawan: శిఖర్ ధావన్‌పై ఎందుకింత వివక్ష.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook