India vs Australia: టీ 20 సిరీస్‌కు జడేజా దూరం

ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంతో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా (India vs Australia) తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయం కారణంగా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తెలిపింది.

Last Updated : Dec 5, 2020, 11:53 AM IST
India vs Australia: టీ 20 సిరీస్‌కు జడేజా దూరం

India vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంతో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా (India vs Australia) తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) గాయం కారణంగా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తెలిపింది. దీంతో రవీంద్ర జడేజా మిగతా రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా తలకు ఎడమవైపు గాయం అయింది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్‌లల్లో జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ (Shardul Thakur) ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది. జాడేజాను ఇంకా అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టామ‌ని, అవ‌స‌రం అయితే మ‌రిన్ని స్కాన్స్ చేస్తామ‌ని బీసీసీఐ శుక్రవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.  Also read: Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు!

క్యాన్‌బెరాలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మిచ‌ల్ స్టార్క్ (Mitchell Starc) వేసిన ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో జ‌డేజా తలకు బంతి తీవ్రంగా తగిలింది. అయినప్పటికీ జడేజా ఇన్నింగ్స్‌ను పూర్తిచేశాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ జ‌రిపిన క్లినిక‌ల్ డ‌యాగ్న‌సిస్ ద్వారా జ‌డేజా కాంక‌ష‌న్‌కు గురైన‌ట్లు తేల్చారు. ఈ మ్యాచ్‌లో జ‌డేజా కేవ‌లం 23 బంతుల్లో 44 ర‌న్స్ చేసి భార‌త్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

ఆ తర్వాత జ‌డేజా స్థానంలో కాంక‌ష‌న్ ప్లేయ‌ర్‌గా దిగిన యుజువేంద్ర చాహల్‌ ( Yuzvendra Chahal ) మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలాఉంటే.. ఆదివారం సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News