India vs Bangladesh 2nd Test Playing 11 Out: ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం అయింది. ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ చెప్పాడు. యాసిర్ స్థానములో మోమినుల్, ఎబాడోట్ స్థానంలో తస్కిన్ ఆడుతున్నారు. మరోవైపు భారత్ తుది జట్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కింది.
రెండు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి. బంగ్లాను దాని సొంతగడ్డపై మరోసారి ఓడించాలని రాహుల్ సేన పట్టుదలగా ఉంది. పనిలోపనిగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ చేరే అవకాశాలను కూడా మెరుగుపర్చుకోవాలని భావిస్తుంది. మరోవైపు రెండో టెస్టులో నెగ్గి సిరీస్‌ను 1-1తో డ్రా చేయాలని బంగ్లా కసితో ఉంది.
Toss Update - Bangladesh have won the toss and elect to bat first in the 2nd Test against #TeamIndia
Live - https://t.co/XZOGpeuLsj #BANvIND pic.twitter.com/khq03eLbva
— BCCI (@BCCI) December 22, 2022
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్, జాకిర్ హసన్, మామినుల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీం, షకిబ్ అల్ హసన్, నురుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తజ్ముల్ ఇస్లాం, సయ్యద్ ఖాలేద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్.
Also Read: Apple iPhone: రూ.20 వేల లోపే ఐఫోన్.. ఎగబడి కొంటున్న జనం! ఇంత చౌకగా ఇదే తొలిసారి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.