India vs South Africa 2nd ODI Highlights: సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. టీమిండియా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే.. దక్షిణాఫ్రికా (South Africa) 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికా ఓపెనర్స్ మలన్ 108 బంతుల్లో 91 రన్స్ చేశాడు. 8 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఇక క్వింటన్ డికాక్ 66 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. అలాగే డసెన్ 37 రన్స్, మార్‌క్రమ్ 37 పరుగులు, బవుమా 35 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో చాహల్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
ఇక క్వింటన్ డికాక్ మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అలాగే మలన్ కూడా నిలకడగా ఆడాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 66/0తో నిలిచింది.
డికాక్ 37 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మలన్ కూడా దూకుడు పెంచి హాఫ్ సెంచరీ చేశాడు. 22 ఓవర్‌లో డికాక్‌ని శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కి పంపాడు. ఆ తర్వాత దూకుడుని కొనసాగిస్తూ సెంచరీ వైపు దూసుకెళ్తోన్న మలన్‌ని కూడా బుమ్రా పెవిలియన్‌కి పంపించేశాడు. తర్వాతి ఓవర్‌లోనే బవుమా (35) చాహల్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక డసెన్, మార్‌క్రమ్ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు.
Also Read : YouTube channels Ban: 35 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు- కారణాలివే..
అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ శుభారంభాన్నే అందించారు. ఇద్దరూ నిలకడగా ఆడారు. టీమిండియా (India) 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. మొదట్లో ఓపెనర్స్ కేఎల్ రాహుల్ (55)తో పాటు శిఖర్ ధావన్ (29) రాణించారు. ఇక కోహ్లి (0) డకౌట్‌తో నిరాశ పరిచాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 71 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. శ్రేయస్ అయ్యర్ (11), వెంకటేశ్ అయ్యర్ (22) పరుగులు చేశారు. చివరగా శార్దూల్ ఠాకూర్ (40), అశ్విన్ (25) నిలకడగా ఆడారు. ఇక సౌతాఫ్రికా బౌలర్స్‌లలో షంసి రెండు, మగళ, కేశవ్ మహారాజ్, మార్‌క్రమ్, పెహులుక్వాయో తలో వికెట్ తీశారు.
Also Read : Harbhajan Singh - Covid-19: టీమిండియా మాజీ క్రికెటర్‌కు కరోనా.. రెండు సంవత్సరాలుగా తప్పించుకున్నా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook