IPL 2021 Latet News: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు ఫ్రాంచైజీలకు ఆహ్వానం పలుకుతోంది. ఆటగాళ్ల రీటెన్షన్ విధానం, వేలం, జీతాల పెంపు, కొత్త ఫ్రాంచైజీలపై బీసీసీఐ పలు నిర్ణయాలు తీసుకుంది.
ఐపీఎల్ 2022లో కొత్త ఫ్రాంచైజీలుగా చేరడానికి అదానీ గ్రూప్ (అహ్మదాబాద్), అరబిందో ఫార్మా (హైదరాబాద్), సంజీవ్ గోయెంకా గ్రూప్ (కోల్‌కతా), టొరెంట్ గ్రూప్ (గుజరాత్) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే వీటిలో రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే వచ్చే ఐపీఎల్లో అవకాశం లభించనుంది. మరోవైపు ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో యూఏఈ వేదికగా నిర్వహించనున్నారని తెలిసిందే. ఐపీఎల్ 2022 కోసం ఈ ఆగస్టులో టెండర్లకు ఆహ్వానం పలకాలని బీసీసీఐ భావిస్తోంది. డిసెంబర్ చివరి నాటికి వేలం ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యూహాలు రచిస్తోంది.
Also Read: Mithali Raj Records: టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత, మహిళల క్రికెట్లో కీలక మైలురాయి
రెండు కొత్త ఫ్రాంచైజీలు జతకానుండటం, మరోవైపు భారీ వేలానికి రంగం సిద్ధం కావడంతో ఆటగాళ్ల వేలానికి సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులకు బీసీసీఐ కొన్ని నియమాలు తెలుపుతూ పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఫ్రాంచైజీలు పెరగడంతో ఐపీఎల్ హక్కులు సైతం అధిక ధరకు అమ్ముడుపోతాయి. ఏదైనా ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రీటెయిన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే ఇద్దరు విదేశీ క్రికెటర్లు, ఇద్దరు భారత ఆటగాళ్లు లేదా ఓ విదేశీ ఆటగాడు, ముగ్గురు భారత క్రికెటర్లను తమ దగ్గరే అట్టిపెట్టుకోవచ్చు.
ఒక్క ఆటగాడిని రీటెయిన్ చేసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి. ఇద్దరు అయితే తొలి క్రికెటర్‌కు రూ.12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ.8.5 కోట్లు, ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు చొప్పున చెల్లించాలని ఐపీఎల్ 2022కు సంబంధించి బీసీసీఐ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 90కి చేరుతుంది. ఆటగాళ్ల జీతాలను సైతం పెంచడానికి ఫ్రాంచైజీలకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook