CSK vs KKR: ఐపీఎల్ 2022లో కేకేఆర్ జట్టు బోణీ కొట్టింది. గత ఛాంపియన్‌పై అవలీలగా విజయం సాధించింది. కేకేఆర్ బౌలింగ్ ధాటికి సీఎస్కే చతికిలపడింది.
క్రికెట్ ప్రేమికులు ఎన్నాళ్ల నుంచే ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ 15 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ గత సీజన్ ఫైనలిస్టులు చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగింది. కేకేఆర్ జట్టు గత ఏడాది ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అవలీలగా విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులే చేయగలిగింది. ఎంఎస్ ధోని ఒక్కడే 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్‌లో ఏ విధమైన విధ్వంసకర బ్యాటింగ్ కన్పించలేదు. కేకేఆర్ బౌలింగ్ ఎదుర్కోలేక డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే చతికిలపడింది. తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన రవీంద్ర జడేజా..బ్యాటింగ్ , బౌలింగ్‌లో విఫలమయ్యాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు సునాయసంగా లక్ష్యం ఛేధించింది. కేవలం 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి..133 పరుగులు సాధించింది. కేకేఆర్ జట్టు తరపున గత సీజన్లో ఆరెంజ్ క్యాప్ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి డకౌట్ కావడం విశేషం. అటు కాన్వే కూడా విఫలమ్యాడు. ఉమేష్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీసి..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. కేకేఆర్ జట్టు బౌలింగ్ ఎంత సమర్ధవంతంగా ఉందంటే..ఓ దశలో 8 ఓవర్ల వరకూ అసలు బౌండరీనే లేదు. మరోవైపు 17 ఓవర్లకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి..84 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ పరిస్థితుల్లో ధోనీ నిలబడి గట్టిగా ఆడటంతో చివరి 3 ఓవర్లలో 47 పరుగులు సాధించగలిగింది.
Also read: CSK vs KKR: తొలి మ్యాచ్‌లోనే ధోనీ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్ 132...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook