ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఏ జట్టు ఎవరిని వదులుకుంటుందో లేదా కొనసాగిస్తుందో అనేది త్వరలో తేలనుంది. ఏ జట్టు పరిస్థితి ఎలా ఉండనుందో పరిశీలిద్దాం.
IPL Retention 2022 జాబితా వెలువడాల్సి ఉంది. ఐపీఎల్ బరిలో ఉన్న వివిధ ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను జట్టులో కొనసాగిస్తాయో, ఎవరిని వదులుకుంటాయో ప్రకటించనున్నాయి. రిటెన్షన్ లిస్ట్ ఆధారంగా మిగిలిన ఆటగాళ్ల కోసం వేలంపాట జరగనుంది. ఈ జాబితా ఇవాళ అంటే నవంబర్ 30న విడుదల కానుంది. ఇవాళ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు రిటెన్షన్ రూల్స్‌కు అనుగుణంగా ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుందో తెలియనుంది. ఈసారి ఐపీఎల్ 2022పై అభిమానుల్లో భారీ ఆశలున్నాయి. ఎందుకంటే మరో రెండు జట్లు ఐపీఎల్లో చేరాయి. మొత్తం పది జట్లతో ఐపీఎల్ 2022(IPL 2022)ఉండనుంది. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుందో పరిశీలిద్దాం.
నిబంధనల ప్రకారం ప్రతి జట్టు కొంతమందిని మాత్రమే కొనసాగించుకునే వీలుంది. కొందందిని కొత్తగా తీసుకోవల్సి ఉంటుంది. ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను కొనసాగించుకోవచ్చు. ముగ్గురు భారత ఆటగాళ్లు లేదా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఆ ముగ్గురు క్యాప్డ్ లేదా అన్క్యాప్డ్ కావచ్చు. మెగా వేలంలో ప్రతి జట్టు గరిష్టంగా 90 కోట్ల వరకూ ఖర్చు పెట్టవచ్చు. ఈ ఖర్చులోంచే ఆటగాళ్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ రిటైన్ ప్లేయర్ జాబితా(IPl Retain Players List) ఇలా ఉండవచ్చని అంచనా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni), రవీంద్ర జడేజా, రుతురాత్ గైక్వాడ్, మొయిన్ అలీ, సామ్ కరన్‌లకు అవకాశం ఉండవచ్చు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, చహల్, హర్షల్ పటేల్ లు కొనసాగవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkatta Knight riders) జట్టులో రసెల్, నరైన్, గిల్, వెంకటేశ్ అయ్యర్‌లకు తిరిగి స్థానం ఉండే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, బూమ్రా, ఇషాన్ కిషన్, పొలార్డ్‌లు కొనసాగనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విషయంలో రిషభ్ పంత్, పృథ్వీ షా, అక్షర్ పటేల్, నోర్ట్జేలు తిరిగి కొనసాగవచ్చు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో(Rajasthan Royals)సంజూ శాంసన్, బట్లర్, బెన్‌స్టోక్స్, యశస్వి జైస్వాల్‌లు కొనసాగవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో రషీద్ ఖాన్, విలియమ్సన్, ఉమ్రన్ మాలిక్‌లు కొనసాగే పరిస్థితి కన్పిస్తుంది.
Also read: Virat Kohli, Anushka Sharma pics: అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ ఫోటో పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook