CSK vs DC: చెపాక్‌లో చెన్నైకి చెత్త రికార్డు.. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తుందా?

CSK vs DC, Delhi Capitals to win vs Chennai Super Kings. చెపాక్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కూడా గెలిచే అవకాశం ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 10, 2023, 05:19 PM IST
CSK vs DC: చెపాక్‌లో చెన్నైకి చెత్త రికార్డు.. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తుందా?

Delhi Capitals have a chance to win against Chennai Super Kings Today IPL Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి అంకానికి చేరాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఏవో మరో రెండు రోజుల్లో తేలనుంది. కొన్ని జట్లు సునాయాసంగా ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉండగా.. మరికొన్ని టీమ్స్ మాత్రం కష్టపడాల్సి ఉంది. ఐపీఎల్ 2023లో  చెపాక్‌ వేదికగా నేడు రాత్రి 7. 30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. పాయింట్స్ పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై నేడు విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌ దిశగా మరో అడుగు వేస్తుంది. అదే సమయంలో ఢిల్లీ నేడు ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. 

చెపాక్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కూడా గెలిచే అవకాశం ఉంది. ఇందుకు ఓ కారణం ఉంది. చెపాక్‌లో చివరగా ఆడిన ఐదు మ్యాచుల్లో చెన్నై మూడు మ్యాచులలో ఓడిపోయింది. చెపాక్ మైదానంలో చివరగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీని కూడా తక్కువ అంచనా వేయలేం. ప్రస్తుతం ఢిల్లీ మంచి ఫామ్ అందుకుంది. తాాజగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది.  దాంతో నేడు చెన్నైపై కూడా చెలరేగే అవకాశం ఉంది. 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు 27 మ్యాచుల్లో ఇరు జట్లూ తలపడ్డాయి. ఇందులో చెన్నై 17 మ్యాచుల్లో గలవగా.. ఢిల్లీ 10 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో మాత్రం ఇరు జట్లూ తొలిసారి తలపడుతున్నాయి. విజయం ఎవరిని అలరిస్తుందో చూడాలి. ఈ సీజన్ ప్రారంభంలో రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన బెన్‌ స్టోక్స్‌.. మళ్లీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మొయిన్‌ అలీ స్థానంలో స్టోక్స్‌ రానున్నాడు. దూకుడుగా ఆడుతున్న అజింక్య రహానే మరోసారి చెలరేగితే ఢిల్లీకి కష్టాలు తప్పవు. 

ఇటీవల చెన్నై, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల హవా కొనసాగింది. మ్యాచుకు ముందు కాస్త చినుకులు పడటంతో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. అయితే చాలా రోజుల తర్వాత రాత్రి పూట మ్యాచ్‌ జరగనుండటంతో అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.

జట్లు (అంచనా): 
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానె, శివమ్‌ దూబె, మొయిన్ అలీ/బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ / వికెట్ కీపర్), దీపక్ చహర్, మహీశ్‌ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్ పాండే. 
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రొసోవ్, మనీశ్ పాండే, అక్షర్‌ పటేల్, అమన్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్‌ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్. 

Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!

Also Read: 2023 Upcoming Electric SUVs: టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా సహా.. ఈ 6 ప్రసిద్ధ ఎస్‌యూవీల ఎలక్ట్రిక్ వెర్షన్స్ వస్తున్నాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News