CSK vs GT IPL 2023 Qualifier 1 Playing 11: ఐపీఎల్ 2023 తుది దశకు చేరింది. 16వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లేఆఫ్స్ సమరం మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. మంగళవారం (మే 23న) నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆరంభం అవుతాయి. గుజరాత్ టైటాన్స్ (20 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (17 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (17 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (16 పాయింట్లు) నాలుగు స్థానాల్లో నిలిచాయి. టాప్-2లో ఉన్న జట్లు గుజరాత్, చెన్నై క్వాలిఫయర్-1.. మూడు, నాలుగు స్థానాల్లోని లక్నో, ముంబై జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఆడతాయి.
మే 23న (మంగళవారం) గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో విజయం సాధించిన జట్టు నేరుగా ఐపీఎల్ 2023 ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అందుకే విజయం సాధించడానికి ఇరు జట్లు చూస్తాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జియో సినిమా యాప్‌లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించే అవకాశం కూడా ఉంది.
కీలక క్వాలిఫయర్ 1 మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే బ్యాటర్లు, బౌలర్లు అందరూ ఫామ్ మీదున్నారు. శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మొహ్మద్ షమీ గుజరాత్ తరపున సత్తాచాటుతుండగా.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దుబే, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండేలు ఫామ్ మీదున్నారు.
తుది జట్లు (అంచనా):
గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, దాసున్ షనక, రషీద్ ఖాన్, మొహ్మద్ షమీ, యష్ దయాల్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, అజింక్య రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/కీపర్), దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహీష్ తీక్షణ.
Also Read: GT vs CSK Head to Head: గుజరాత్, చెన్నై మధ్య తొలి క్వాలిఫయర్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.