Trolls On David Warner: రిషబ్ పంత్ లేనిలోటు ఢిల్లీ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఆ జట్టును ప్రభావం చూపిస్తోంది. మంగళవారం ముంబై ఇండియన్స్‌పై చివరి బంతి వరకు పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఆఖర్లో ఫీల్డింగ్ తప్పిదాలే ఢిల్లీని ముంచాయి. మరోవైపు ఢిల్లీ వరుస ఓటములకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కారణమంటూ.. నెట్టింట దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. అందుకే ఢిల్లీ ఓడిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెల్ఫీఫ్ ప్లేయర్ అని.. వన్డే ప్రపంచ కప్‌కు ప్రాక్టీస్ కోసం ఆడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీల సాయంతో 209 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ (225) మాత్రమే వార్నర్ కంటే ముందున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టులో వార్నర్, అక్షర్ పటేల్ మినహా మిగిలిన ప్లేయర్లు అంతా ఫ్లాప్ అవుతున్నారు. బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజ్‌లో నిలబడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. దూకుడుగా ఆడి తన వికెట్ కూడా సమర్పించుకుంటే జట్టు మరింత ఇబ్బందులు పడుతుందనే వార్నర్ నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. అయితే జట్టు కోలుకున్న తరువాత కూడా బ్యాట్‌ను ఝులిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Just Because of D Warner All DC Batters are Losing Their Wickets‼️
D Warner is Playing too Slow This Season and That's Giving Pressure to Other Batters‼️
Such a Selfish Player, Just to Race for Orange Cap👏🏻#DavidWarner @davidwarner31 @DelhiCapitals #IPL2023 #DCvsMI #MIvsDC
— Anurag Dwivedi 🏏 (@AnuragxCricket) April 11, 2023
డేవిడ్ వార్నర్ స్లో బ్యాటింగ్‌ను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గత నాలుగు మ్యాచ్‌లలో వార్నర్ స్ట్రైక్ రేట్ 114.83 గా ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా వికెట్లు పడుతుండడంతో మరో ఎండ్‌లో వార్నర్ వికెట్ కాపాడుకుంటూ హ్యాండిల్ చేశాడు. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయితే వార్నర్ స్లో బ్యాటింగ్ కారణంగా అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకుంటున్నారని అంటున్నారు. ఈ ట్రోలింగ్‌పై డేవిడ్ వార్నర్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.
If I told you a couple of years ago that a time would come when Axar Patel would be a more effective batsman in both red and white ball than David Warner- would you have believed me?
— Nikhil Naz (@NikhilNaz) April 11, 2023
జట్టు ఓటమిపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తాము నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడానికి వేగంగా పరుగులు చేయకపోవడం కూడా ఓ కారణం కావొచ్చన్నాడు. రన్‌రేట్ మెరుగ్గా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు. డేవిడ్ వార్నర్ బాగా పరుగులు చేస్తున్నాడని.. కానీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వేగంగా రన్స్ చేయలేకపోతున్నాడని అన్నాడు. ఈ విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్, కోచ్ కూడా వార్నర్‌తో మాట్లాడారని తెలిపాడు.
Also Read: DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook