Here is reasons Gujarat Titans will win against Chennai Super Kings: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. 16వ సీజన్లో అగ్రస్థానంలో లీగ్ దశను ముగించిన గుజరాత్ టైటాన్స్, పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా నేడు రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ (GT vs CSK IPL 2023 Qualifier 1) మొదలు కానుంది. ఈ మ్యాచులో గెలిచి తొలి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఐపీఎల్ 2023లో రెండు దీటైన జట్ల మధ్య పోరు కోసం ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
హెడ్ టు హెడ్:
చెన్నై వేదికగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగడం చెన్నై సూపర్ కింగ్స్‌కు అనుకూలత అయినప్పటికీ.. ఎంఎస్ ధోనీ సేనపై ఓటమి ఎరుగని రికార్డు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద సానుకూలాంశం. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు గుజరాత్, చెన్నై జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా.. మూడింటిలోనూ హార్దిక్ సేన గెలిచింది. అంతేకాదు ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాలను గుజరాత్ ఛేదించింది. అయితే చెన్నై వేదికగా మాత్రం గుజరాత్, చెన్నై జట్లు ఇప్పటివరకు తలపడలేదు. నేడు తొలిసారిగా తలపడుతున్నాయి.
ఓపెనింగ్ జోడి:
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరిద్దరూ నేడు కూడా చెలరేగితే భారీ స్కోర్ ఖాయం. హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, దాసున్ శనక, రాహుల్ తెవాటియా రాణిస్తున్నారు. గుజరాత్ ప్లేయర్స్ ఎనిమిదో వరుస బ్యాటర్ కూడా బాదేయగలరు. అవకాశం వస్తే బంతిని బాదడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. వీరిని ఆపడం చెన్నై బౌలర్లకు కష్టమే.
ఫామ్‌లో బౌలర్లు:
ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అదిరిపోయే ఫామ్ కనబరుస్తున్నారు. ఎలాంటి సమయంలో అయినా జట్టును ఆదుకుంటున్నారు. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మొహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌లు చెలరేగుతున్నారు. కలిసొచ్చే పిచ్‌పై మ్యాచ్‌నే మలుపుతిప్పేస్తున్నారు. ముఖ్యంగా మొహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌లు పోటీపడి వికెట్స్ పడగొడుతున్నారు. ఈ ఇద్దరి బౌలింగ్ సమర్ధంగా ఎదుర్కొంటేనే.. చెన్నై స్కోర్ చేయగలదు.
గణాంకాలు అంత గొప్పగా లేవు:
చెన్నై బ్యాటింగ్‌లో ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ చాలా కీలకం. వెళ్ళిద్దరిని ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుట్టలో వేసుకునే అవకాశం మహమ్మద్ షమీకి ఉంది. ఆరంభంలో కాస్త తపడినపుడే ఔట్ చేస్తే చెన్నై పరుగుల వరద ఆగుతుంది. షమీ బౌలింగ్‌ను కాన్వే, గైక్వాడ్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. మిడిలార్డర్‌లో చెన్నై పూర్తిగా శివమ్ దూబే ఫామ్‌పై ఆధారపడుతోంది. అన్ని జట్ల స్పిన్నర్లకు దూబే చుక్కలు చూపిస్తున్నాడు. అయితే రషీద్ ఖాన్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. దూబే గణాంకాలు అంత గొప్పగా లేవు. అజింక్య రహానే, ఎంఎస్ ధోనీ కూడా అఫ్గాన్ బౌలర్ స్పిన్ ను కాస్త ఆచితూచి ఆడతారు. ఇవన్నీ టైటాన్స్‌కే అనుకూలం కాబట్టి విజయావకాశాలు హార్దిక్ సేనకు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: GT vs CSK Qualifier 1: చెన్నైతో గుజరాత్ మ్యాచ్.. ధోనీ సేనకు గిల్ వార్నింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.