Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing 11 Out: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని కోల్‌కతా కెప్టెన్ నితీష్ చెప్పాడు. మరోవైపు హైదరాబాద్ మాత్రం వాషింగ్టన్ సుందర్ స్థానంలో అభిషేక్ శర్మను తీసుకుంది.
ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్దే పైచేయి. ఈడెన్ గార్డెన్లో ఇరు జట్లు 8సార్లు తలపడగా.. కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. గత మ్యాచులోనే విజయం అందుకుని పాయింట్ల ఖాతా తెరిచిన హైదరాబాద్.. ఇవాళ్టి మ్యాచ్‌లో జోరు కొనసాగిస్తుందో? లేదో? చూడాలి. వరుసగా రెండింట్లో విజయం సాధించి జోరు మీదున్న కోల్‌కతా మరో విజయంపై కన్నేశాడు. గుజరాత్‌పై చెలరేగిన రింకు సింగ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. ఈ రోజు ఎలా ఆడతాడో చూడాలి.
🚨 Toss Update 🚨@KKRiders win the toss and elect to field first against @SunRisers.
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPL | #KKRvSRH pic.twitter.com/77S1a7knB9
— IndianPremierLeague (@IPL) April 14, 2023
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మనుల్లా గుర్బాజ్ (కీపర్), ఎన్ జగదీశన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, సుయాశ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.
సబ్స్టిట్యూట్లు ప్లేయర్స్:
హైదరాబాద్: అబ్దుల్ సమద్, వివ్రాంత్ శర్మ, మయాంక్ దగర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్.
కోల్‌కతా: మన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ వైజ్, కుల్వంత్ ఖజ్రోలియా.
Also Read: Budh Asta 2023: అస్తమిస్తున్న బుధుడు.. 9 రోజుల తర్వాత ఈ రాశుల వారిపై కురవనున్న డబ్బు వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.