Virat Kohli reveals why he not leave Royal Challengers Bangalore since 2008: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు 'విరాట్ కోహ్లీ' మాత్రమే. మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)లో కోహ్లీ భాగమయ్యాడు. క్యాష్ రిచ్ లీగ్ మొదలైన 2008 నుంచి ఇప్పటికీ ఆర్‌సీబీలోనే కొనసాగుతున్నాడు. ఏ ఆటగాడూ ఇన్ని సంవత్సరాలు ఇలా ఒకే జట్టు తరఫున ఆడలేదు. భారత ప్లేయర్స్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
ఆర్‌సీబీ ఫ్రాంచైజీలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రారంభ సంవత్సరాల్లో రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జాక్వెస్ కల్లిస్, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఆ తర్వాత క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆడాడు. కోహ్లీ సారథిగా ఐపీఎల్ 2016లో ఫ్రాంచైజీని ఫైనల్‌కి తీసుకెళ్లాడు. ఆర్‌సీబీకి చాలా సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. 2021 సీజన్ తర్వాత రాజీనామా చేశాడు. లాంటి కోహ్లీ ఒకానొక సమయంలో బెంగళూరును వదిలేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని విరాట్ స్వయంగా చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో మరొక ఫ్రాంచైజీలో చేరడానికి ఎలా ఆసక్తి చూపాడో వెల్లడించాడు.
జియో సినిమాలో టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్పకు విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఉతప్ప అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. '2008లో ఐపీఎల్ మొదలైన తర్వాత 2-3 ఏళ్ల పాటు ఆర్‌సీబీలో 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడిని. ఆ స్థానాల్లోపెద్దగా రాణించలేదు. ఆ సమయంలోనే టాపార్డర్ అవకాశం ఇచ్చే జట్టు కోసం వెతికా. ఒక ఫ్రాంచైజీతో మాట్లాడితే కుదరలేదు. ఆ తర్వాత భారత జట్టులో మూడో స్థానంలో ఆడాను. 2011లో రిటెన్షన్ ముందే ఫామ్ అందుకున్నా. అప్పుడు ఆర్‌సీబీ యాజమాన్యం కలిసి రిటైన్ చేసుకుంటున్నాం అని చెప్పింది' కోహ్లీ చెప్పాడు.
'నన్ను ఆర్‌సీబీ యాజమాన్యం కలిసినప్పుడు ఓ కండిషన్ పెట్టా. నేను భారత జతుత్లో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నా. ఆర్‌సీబీలో కూడా మూడో స్థానంలో ఆడతా అని చెప్పా. ఆర్‌సీబీ యాజమాన్యం ఒకే చెప్పడంతో కొనసాగాను. అదే సమయంలో నన్ను కాదన్న ఫ్రాంచైజీ సంప్రదించింది. మీరు వేలానికి వస్తే తీసుకుంటాం అని చెప్పింది. అందుకు నో చెప్పా. నా అభిప్రాయానికి ఆర్‌సీబీలో విలువ ఇచ్చారు. ఇక్కడ నాకు గౌరవం దక్కింది. అందుకే ఈ జట్టును వదలను' అని విరాట్ కోహ్లీ చెప్పుకోచ్చాడు.
Also Read: Virat Kohli IPL Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో 'ఒకే ఒక్కడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Virat Kohli on RCB: నేను పెట్టిన కండిషన్‌కు ఆర్‌సీబీ ఓకే చెప్పింది.. ఆసక్తికర విషయం చెప్పిన విరాట్ కోహ్లీ!