Royal Challengers Bangalore IPL 2023: ఈ సాల కప్ నమ్దే.. ఐపీఎల్ ప్రారంభమవుతున్న ప్రతిసారి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ శిబిరం నుంచి వినిపించే డైలాగ్ ఇది. ప్రతిసారి కప్ కొడుతుందన్న నమ్మకంతో బరిలోకి దిగడం.. ఉట్టి చేతులతో ఇంటికి రావడం పరిపాటిగా మారింది. ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా గట్టి పోటీని ఇస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ఏకైక జట్టు ఆర్సీబీనే కావడం గమనార్హం. గతేడాది ఫైనల్‌కు ఒక అడుగు దూరంలో టోర్నీ నుంచి నిష్క్రమిచారు. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతోంది. 15 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని ఆర్సీబీ భావిస్తోంది.
ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీల కరువు తీర్చుకుని సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసి వచ్చే అంశం. దినేష్ కార్తీక్, రజత్ పాటిదార్, కెప్టెన్ ఫాప్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హసరంగా వంటి ఆటగాళ్లు మరోసారి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. రీస్ టాప్లీ చేరికతో బౌలింగ్ విభాగం కూడా మరింత బలోపేతమైంది. మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. అయితే గాయం కారణంగా హేజిల్‌వుడ్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పాటిదార్ గాయం కూడా ఆందోళన కలిగిస్తోంది. గాయపడిన విల్ జాక్స్ స్థానంలో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఎంపిక చేసింది. మొత్తంగా బౌలింగ్ విభాగం రాణిస్తే.. ఆర్సీబీకి ఇక తిరుగుండదు.
2021లో కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్‌బై చెప్పగా.. చెన్నై జట్టు నుంచి డు ప్లెసిస్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది ఆర్సీబీ మేనేజ్మెంట్. గత సీజన్లో అనూహ్యం ప్లే ఆఫ్స్‌కు చేరగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో పాటిదార్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. అయితే క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోవడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి అన్ని అడ్డంకులు దాటుకుని కప్ కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆర్సీబీ షెడ్యూల్ ఇలా..
==> ఏప్రిల్ 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs ముంబై ఇండియన్స్, బెంగళూరు
==> ఏప్రిల్ 6- కోల్‌కతా నైట్ రైడర్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా
==> ఏప్రిల్ 10- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు
==> ఏప్రిల్ 15- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు
==> ఏప్రిల్ 17- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు
==> ఏప్రిల్ 20- పంజాబ్ కింగ్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మొహాలి
==> ఏప్రిల్ 23- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు
==> ఏప్రిల్ 26- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు
==> మే 1- లక్నో సూపర్ జెయింట్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో
==> మే 6- ఢిల్లీ క్యాపిటల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ
==> మే 9- ముంబై ఇండియన్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై
==> మే 14- రాజస్థాన్ రాయల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, జైపూర్
==> మే 18- సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్
==> మే 21- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs గుజరాత్ టైటాన్స్, బెంగళూరు
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు కూడా చేరదు.. మాజీ క్రికెటర్ జోస్యం
Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి