రాంచి: మహేంద్ర సింగ్ ధోని సోమవారం రాంచిలోని జవహార్ విద్యామందిర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య సాక్షి ధోని కూడా అతడితోపాటే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో ధోని నాలుగేళ్ల కూతురు జివా ధోని కూడా వారితోనే ఉండటంతో అక్కడ సందడిపూరిత వాతావరణం కనిపించింది. అభిమానులు ధోనితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ధోని ఓటు వేసిన తర్వాత తన కూతురు జివాతో కలిసి తీసుకున్న ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అందరికీ సూచించిన జివా ఆ వీడియోలో ఏం చెప్పిందో మీరే చూడండి.
లోక్ సభ ఎన్నికలు 5వ విడత పోలింగ్‌లో భాగంగా నేడు జార్ఖండ్‌లో నాలుగు లోక్ సభ స్థానాలైన హజారిబాగ్, కొడెర్మ, రాంచి, ఖుంతి(ఎస్టీ)లలో పోలింగ్ జరుగుతోంది. ఐపిఎల్ ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టేన్‌గా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పకీ.. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకే ధోని ప్రాధాన్యత ఇచ్చాడు.