Asia Cup 2022 Winner: ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు.. ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక!

PAK vs SL: Sri Lanka Beat Pakistan in Asia Cup 2022 Final. ఆసియా కప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించిన శ్రీలంక ఆసియా కప్‌ను ఆరోసారి ముద్దాడింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 08:53 AM IST
  • ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు
  • ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక
  • ఆసియా కప్‌ను ఆరోసారి ముద్దాడింది
Asia Cup 2022 Winner: ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు.. ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక!

Sri Lanka Beat Pakistan to Win Asia Cup 2022: ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు శ్రీలంక జట్టుపై ఎటువంటి అంచనాలు లేవు. పటిష్ట జట్లయిన భారత్‌ లేదా పాకిస్తాన్ టైటిల్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. శ్రీలంక జట్టును కనీస పోటీదారుగా కూడా ఎవరూ పరిగణించలేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. లంక ఆసియా కప్‌ 2022ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభంలో కాస్త తబడిన లంక.. ఆపై మంచి ప్రదర్శన చేస్తూ.. ఫైనల్లో పాకిస్థాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దాంతో ఆసియా 2022 'కింగ్‌'గా నిలిచి.. ఆసియా కప్‌ను ఆరోసారి ముద్దాడింది. 

ఆసియా కప్ 2022లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మూడో బంతికే ఓపెనర్ కుశాల్‌ మెండిస్ (0)ను బౌల్డ్‌ చేయడం ద్వారా నసీమ్‌ షా లంక పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత హరీష్ రవూఫ్‌ నాలుగో ఓవర్లో మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక (8)ను ఔట్‌ చేశాడు. ఆరో ఓవర్లో దనుష్క గుణతిలక (1)ను రవూఫ్‌ వెనక్కి పంపాడు. ధనంజయ డిసిల్వా (28)ను ఇఫ్తికార్‌ అహ్మద్, దాసున్ శానక (2)ను షాదాబ్‌ ఖాన్ ఔట్‌ చేయడంతో.. 55 పరుగులకే కీలక 5 వికెట్లు కోల్పోయిన లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స (71 నాటౌట్‌; 45 బంతుల్లో 6×4, 3×6) గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. పాక్ బౌలర్లపై విరుచుపడుతూ పరుగులు చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగించాడు. దాంతో లంక స్కోర్ కుదురుకుంది. మరోవైపు వానిందు హసరంగ (36; 21 బంతుల్లో 5×4, 1×6)తో అతడికి మంచి సహకారం అందించాడు. హసరంగతో కలిసి ఆరో వికెట్‌కు 58 రన్స్ జోడించాడు. ఆపై చమిక కరుణరత్నె (14 నాటౌట్‌) తో కలిసి 54 పరుగులు జోడించాడు. దాంతో లంక 170 రన్స్ చేసింది. 

అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో147 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ అజామ్‌ (5), ఫకార్‌ జమాన్‌ (0) త్వరగానే ఔట్ అయినా.. మహమ్మద్‌ రిజ్వాన్‌ (55; 49 బంతుల్లో 4×4, 1×6), ఇఫ్తిఖార్‌ అహ్మద్ (32) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు రాణించడంతో పాక్‌ 13 ఓవర్లలో 91/2తో నిలిచింది. అయితే రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. ఇఫ్తికార్‌ను ఔట్‌ అయిన అనంతరం పాక్ త్వరగానే వికెట్లు కోల్పోయింది. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్‌ 4, హసరంగ మూడు వికెట్లు పడగొట్టారు. భానుకకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, హసరంగకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 2014లో ఏంజలో మాథ్యూస్‌ నేతృత్వంలోని లంక వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించింది. 

Also Read: Suncity Ganesh Laddu: బాలాపూర్ లడ్డూని తలదన్నిన సన్‌సిటీ గణపతి లడ్డూ, 60 లక్షల ధర

Also Read: Navneet Rana Controversy: గణేశ్ విగ్రహాన్ని బురద నీటిలో విసిరేసిన ఎంపీ నవనీత్ రాణా,

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News