Naseem Shah: ఆగస్టు 28వ తేదీ ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ అందర్నీ ఆకర్షించింది. చివరి వరకూ అనుక్షణం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఓ కారణమైతే..పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా హార్ట్ టచింగ్ ఘటన మరో కారణం..
ఆసియా కప్ 2022లో టీమ్ ఇండియా..పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. చివర్లో 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన పరిస్థితి వరకూ మ్యాచ్ వచ్చింది. మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైనా..పాకిస్తాన్ పేస్ బౌలర్ నసీమ్ షా అంకితబావం, కసి, పడిన బాధ అందర్నీ ఆకట్టుకుంది. అందరి మనసుల్ని కలచి వేసింది.
ఆసియా కప్ 2022లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించినా..పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాను మాత్రం ఎవరూ మర్చిపోరు. కాలికైన గాయంతో అతడు పడిన బాధ, ఆట పట్ల అంకితభావం, చిత్తశుద్ధి, కసి అందరి హృదయాల్ని గెల్చుకుంది. కాలికి తీవ్ర గాయమై..నొప్పి వస్తున్నా..ఓ వైపు సరిగా నడవలేకపోతున్నా సరే..బౌలింగ్ పూర్తి చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి..2 వికెట్లు పడగొట్టాడు.
నసీమ్ షా వేసిన నాలుగవ ఓవర్ అతికష్టంగా, భారంగా సాగింది. కాలికైన గాయంతో భయంకరమైన నొప్పితో విలవిల్లాడాడు. ఓవర్ మధ్యలో ఓసారి నొప్పి ఎక్కువై కేకలు వేస్తూ గ్రౌండ్లో కూర్చుండిపోయాడు. అయినా సరే ధైర్యం కోల్పోలేదు. భయంకరమైన నొప్పితోనే ఓవర్ పూర్తి చేశాడు. అందుకే నెటిజన్లు పెద్ద ఎత్తున నసీమ్ షాను ప్రశంసిస్తున్నారు.
16 ఏళ్ల వయస్సుకే..
నసీమ్ షా వ్యక్తిగత జీవితం సైతం కష్టాలతోనే ఉంది. 16 ఏళ్ల నసీమ్ షా తల్లిని కోల్పోయాడు మూడేళ్ల క్రితం 2019లో నసీమ్ షా తల్లి మరణించింది. ఆ సమయంలో అతను ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నాడు. దాంతో నసీమ్ షాకు అతని తల్లిని చూసే అవకాశం కూడా లేకపోయింది.
Also read; Team India Kala Chashma: టీమిండియా కాలా చష్మా డాన్స్.. ఇరగదీశిర్రు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook