Saleem Malik Comments on Teamindia: టీ20 వరల్డ్ కప్‌లో సఫారీ జట్టు చేతిలో ఓడిపోవడం భారత అభిమానుల కంటే పాకిస్థాన్ జట్టు అభిమానులనే ఎక్కువ బాధిస్తోంది. టీమిండియాను సౌతాఫ్రికా ఓడించడంతో పాక్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమిపై పాకిస్థాన్‌కు చెందిన పలువురు వెటరన్ ఆటగాళ్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాకింగ్ సలీమ్ మాలిక్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయిందని ఆరోపించాడు.
'పాకిస్థాన్ ముందుకు వెళ్లాలని భారత్ ఎప్పటికీ కోరుకోదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా కాస్త మెరుగైన ఫీల్డింగ్ చేసి ఉంటే గెలిచి ఉండేది. భారత ఆటగాళ్లు డర్టీగా ఫీల్డింగ్ చేయడం చాలా నిరాశపరిచింది. పాకిస్థాన్‌కు భారత్ ఎప్పుడూ పోటీగానే ఉంది. టీమిండియా చేసిన ఫీల్డింగ్ విధానం చూస్తుంటే కావాలనే ఓడిపోయినట్లు అనిపిస్తోంది. ప్రారంభంలో ప్రయత్నించినా.. ఆ తరువాత ఫీల్డింగ్ చేసిన విధానం చూస్తే పాక్ జట్టు పైకి రావడం వాళ్లకు ఇష్టం లేదనిపించింది..'అంటూ సలీమ్ మాలిక్ అన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. కచ్చితంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందనుకున్న పాక్.. వరుసగా రెండు ఓటములతో వెనుకబడిపోయింది. ముఖ్యంగా జింబాబ్వే చేతిలో ఓటమి ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. నెదర్లాండ్స్‌పై ఒక విజయంతో ఊరట చెందిన తరువాత రెండు మ్యాచ్‌లు గెలిచి తీరాల్సిందే. ఆ రెండు మ్యాచ్ విజయం సాధించినా.. మిగిలిన జట్ల సమీకరణాల కోసం ఎదురుచూడాలి.
సఫారీ టీమ్‌పై టీమిండియా గెలిచి ఉంటే.. పాక్ జట్టు తెగ సంబురాలు చేసుకునేది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు గట్టి పోటీదారుగా మారేది. తరువాతి మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచే అవకాశం ఉండడంతో తమకు ఛాన్స్ లేనట్లేనని పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు రావడం ఇష్టం లేకనే భారత్ కావాలంనే ఓడిపోయిందంటూ నెట్టంట ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read: Kohli's Room Video Leak: విరాట్ కోహ్లి హోటల్ రూమ్ వీడియో లీక్.. నెట్టింట వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook