R Ashwin moves up to No.2 spot in ICC Test Rankings for All-rounders: తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టిన భారత ప్లేయర్స్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ (Test Rankings)లో అదరగొట్టారు. ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) రెండో స్థానానికి చేరాడు. రెండు టెస్టుల్లో అశ్విన్ 11.35 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 70 పరుగులు చేశాడు. దాంతో యాష్ ఖాతాలో 360 రేటింగ్ పాయింట్లు చేరాయి. అశ్విన్ కంటే ముందు వెస్టిండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్ (382) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికై రాణిస్తే టాప్ ర్యాంక్ దక్కే అవకాశం ఉంది.
గాయం కారణంగా రెండో టెస్ట్ ఆడని రవీంద్ర జడేజా (346) ఆల్‌రౌండర్ జాబితాలో రెండు స్థానాలను కోల్పోయి నాలుగో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ (348) మూడో స్థానంలో ఉన్నాడు. 327 రేటింగ్ పాయింట్లతో బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (908) తొలి స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ (883) రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో టెస్ట్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (756) పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (150), హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal-712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానంకు చేరుకున్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ (797) ఐదో స్థానంలో, కెప్టెన్ విరాట్ కోహ్లీ (756) ఆరో స్థానంలో ఉన్నారు. జో రూట్ (903), స్టీవ్ స్మిత్ (891), కేన్ విలియమ్సన్ (879) మార్నస్ లబుషేన్ (878)లు వరుసగా ఈ జాబితాలో నిలిచారు. డేవిడ్ వార్నర్ (724), క్వింటన్ డికాక్ (717) టాప్-10లోకి వచ్చారు. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (538) ఇరవై రెండుస్థానాలను మెరుగుపరుచుకుని 46వ స్థానంలో, యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (477) పది స్థానాలు ఎగబాకి 66వ స్థానంకు చేరుకున్నారు.
R Ashwin moves up to the No.2 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders.
Full list: https://t.co/vrogyWdn0u pic.twitter.com/RwPzCXd57J
— ICC (@ICC) December 8, 2021
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ (India).. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings)లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. సోమవారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 124 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. 121 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) జట్లు వరుసగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాంబ్వే టాప్-10లో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook