Rashid Latif feels Virat Kohli scored 100 or 200 centuries is useless: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు. దాంతో కోహ్లీ వన్డేల్లో 44వ సెంచరీ నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ( 71)ను కోహ్లీ అధిగమించి రెండో స్థానంకు చేరుకున్నాడు. పాంటింగ్‌ను కోహ్లీ అధిగమించడంతో.. సెంచరీల విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్‌ను అధిగమించగలడా అనే చర్చ సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది.
విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ 100 కాదు 200 సెంచరీలు సాధించడం ముఖ్యం కాదని.. టీమిండియాకి టైటిళ్లు అందించడమే ముఖ్యమని ఎద్దేవా చేశాడు. భారత క్రికెట్ అభిమానులు విరాట్ రికార్డుల కోసం ఎదురుచూడట్లేదని, టైటిల్ సాధించడం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారని లతీఫ్ పేర్కొన్నాడు.
రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'సెంచరీల సంఖ్యను లెక్కించడానికి ఇది సమయం కాదు. ముందుగా టీమిండియా టైటిల్ గెలవాలి. భారత్ ట్రోఫీ గెలిచి ఏళ్లు గడిచాయి. విరాట్ కోహ్లీ 100 సెంచరీలు చేసినా లేదా 200 సెంచరీలు చేసినా పర్వాలేదు. భారత క్రికెట్‌కు మరియు అభిమానులకు మాత్రం టైటిల్ ముఖ్యం. ఆర్థికంగా చూస్తే ఐపీఎల్, భారత క్రికెట్ చాలా ముందున్నాయి. కానీ ఇప్పుడు అభిమానుల నుంచి, మీడియా నుంచి టైటిల్ కావాలంటూ ఒత్తిడి పెరిగింది. ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచకప్, చివరి రెండు టీ20 ప్రపంచకప్‌లు పోయాయి. సెంచరీలకు స్థానం ఉన్నా.. భారత క్రికెట్ బోర్డు ముందుగా ఓ ఐసీసీ టైటిల్ గెలవాలి' అన్నాడు.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఏ ఐసీసీ టోర్నీలోనూ ట్రోఫీని గెలవలేదు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్నా.. పాకిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2021 టెస్ట్ ఛాంపియన్ చిప్, 2022 టీ20 ప్రపంచకప్‌లలో భారత్ టైటిల్స్ గెలవలేకపోయింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఏం చేస్తుందో చూడాలి.
Also Read: Lizard House Indications: ఇంట్లోని ఈ ప్రదేశంలో బల్లి కనిపిస్తే.. మీరు ధనవంతులు అయిపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.