IPL RCB Vs KKR: ఐపీఎల్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ల ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమవడంతో కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా జట్టులో రస్సెల్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో రస్సెల్ కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు.
రస్సెల్ మిగతా కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. బెంగళూరు బౌలర్లలో హసరంగ ఒక్కడే నాలుగు వికెట్లు తీసి కోల్‌కతాను గట్టి దెబ్బ కొట్టాడు. ఆకాశ్ దీప్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ రెండు వికెట్లు, సిరాజ్ ఒక్క వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా ఏ దశలోనూ బెంగళూరు బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు.
తడబడుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ :
కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బెంగళూరు ఆదిలోనే తడబడింది. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ కేవలం 5 పరుగులు, అనుజ్ రావత్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి కేవలం 12 పరుగులే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, సౌథీ ఒక వికెట్ తీశాడు.
కాగా, తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో చెన్నై విధించిన 132 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కోల్‌కతా ఎటువంటి తడబాటు లేకుండా చేధించింది. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. 205 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ పంజాబ్ బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడటంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌తోనైనా బెంగళూరు బోణీ కొట్టాలని చూస్తోంది.
Innings Break!
Brilliant bowling effort from #RCB as #KKR are bowled out for 128 in 18.5 overs.
Hasaranga (4/20), Harshal (2/11)
Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/A22NVk04bW
— IndianPremierLeague (@IPL) March 30, 2022
Also Read: Traffic Challans Discount: వాహనదారులకు గుడ్ న్యూస్... పెండింగ్ చలాన్ల రాయితీ గడువు పొడగింపు
Also Read: ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్.. చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook