RCB Vs PBKS IPL Match Updates: చిన్నస్వామి స్డేడియంలో సిక్సర్ల వర్షమేనా.. సొంతగడ్డపై టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. తుది జట్లు ఇవే..!

Royal Challengers Bangalore Vs Punjab Kings Playing 11: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా గత మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లతోనే ఆడనున్నాయి. సొంతగడ్డపై విజయం సాధించి.. బోణీ కొట్టాలనే లక్ష్యంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 25, 2024, 07:33 PM IST
RCB Vs PBKS IPL Match Updates: చిన్నస్వామి స్డేడియంలో సిక్సర్ల వర్షమేనా.. సొంతగడ్డపై టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. తుది జట్లు ఇవే..!

Royal Challengers Bangalore Vs Punjab Kings Playing 11: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్‌ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్‌తో పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలైన ఆర్‌సీబీ.. ఈ మ్యాచ్‌లో గెలుపొంది ఐపీఎల్ 2024లో బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్‌ను ఓడించి పంజాబ్ కింగ్స్‌ ఈ పోరుకు రెడీ అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. పిచ్ బ్యాటింగ్ అనుకులించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఆడిన టీమ్స్‌తో బరిలోకి దిగుతున్నాయి.

Also Read: Movie Stars Holi: హోలీ సంబరాల్లో సినీ తారలు.. ఒక్కొక్కరు ఒక్కోలా

"మేం బౌలింగ్ చేయబోతున్నాం. చాలా మంచి వికెట్‌గా కనిపిస్తోంది. మా జట్టు ఒక్కసారి కూగా టైటిల్ గెలవలేదని అందరూ అనొచ్చు. కానీ కానీ మహిళలు (RCBW) ట్రోఫీ గెలిచారు. అది మాకు స్పూర్తినిస్తోంది. ఈ సీజన్‌ కోసం మా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోయినా.. చివరకు మళ్లీ కోలుకున్నాం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం. సబిస్టిట్యూటిషన్‌లో రెండు మార్పులు చేశాం.." అని ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.

"టాస్ గెలిచి ఉండే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసి ఉండేవాళ్లం. అయితే ఇప్పుడు మొదట బ్యాటింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్నాం. మేము ఫస్ట్ మ్యాచ్‌లో మా ప్లాన్ పక్కాగా అమలు చేశాం. అందుకే విజయం సాధించాం. అయతే ప్రతి గేమ్‌ను మెరుగుపరుచుకుంటూ ఉండాలి. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం.." అని పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరున్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ ధయాల్.

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News