Rishabh Pant Stunning Catch Video: రీఎంట్రీలో ఢిల్లీ క్యాపిటిల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌తోపాటు వికెట్ కీపింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. వికెట్ల వెనుక పాదరసంలా కదులుతూ స్టంపౌట్స్, స్టన్నింగ్స్ క్యాచ్‌లతో మెస్మరైజ్ చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకుని రంగంలో దిగిన పంత్.. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఎన్నికవ్వడం ఖాయంగా మారింది. బుధవారం గుజరాత టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఒంటి చెత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో గుజరాత్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ బ్యాట్‌ను తాకుతూ వచ్చిన బంతిని సూపర్‌మ్యాన్ తరహాలో పట్టేశాడు. ఈ క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డేవిడ్ మిల్లర్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖేష్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ, స్టబ్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 2 క్యాచ్‌లు పట్టడంతో పాటు 2 స్టంపింగ్స్ కూడా చేశాడు. బ్యాటింగ్‌లో 11 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఈ సీజన్లో ఢిల్లీకి ఇది మూడో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. మూడు విజయాలు 6 పాయింట్లు ఖాతాలో ఉండగా.. రన్‌రేట్ మాత్రం -0.074 తక్కువగా ఉంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ 8 పాయింట్లతో వరుసగా ఆ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. లక్నో 6 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ 8, ముంబై ఇండియన్స్ 9, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. వీటిలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook