Netizens trolls on Sourav Ganguly: గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా గత నెలలో ముగిసిన టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఎవరూ ఊహించని విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కే వన్డే సారథ్య బాధ్యతలు అప్ప్పజెప్పింది. దాంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కోహ్లీ అభిమానులు అయితే బీసీసీఐ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని ప్రకటించినపుడే వన్డే సారథిగా కొనసాగుతానని బీసీసీఐకి విరాట్ కోహ్లీ (Virat Kohli) చెప్పినప్పటికీ.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నారని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) వివరణ ఇచ్చారు. అంతేకాదు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని అభ్యర్థించినా విరాట్ తన మాట వినలేదని చెప్పారు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కోహ్లీ ఇన్నిరోజులు మౌనంగా ఉండిపోయాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ అన్ని విషయాలకు సమాధానం ఇచ్చాడు.
Also Read: Sachin Tendulkar Photo: ఈ ఫొటోలో సచిన్ తో పాటు మరో అతిథి- అదేంటో మీరే కనిపెట్టండి?
మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) మాట్లాడుతూ... 'టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చాను. వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. కెప్టెన్సీ వదిలేయవద్దని నాకు ఎవరూ సూచించలేదు. బీసీసీఐ, అధ్యక్షుడి Sourav Ganguly నుంచి ఇలాంటివి ఊహించలేదు. వన్డే కెప్టెన్సీ మార్పు గురించి నాతో ఎవరూ చర్చించలేదు. సెలక్షన్ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు నాకు సమాచారమిచ్చారు. దక్షిణాఫ్రికాకు వెళ్లే టెస్ట్ జట్టు గురించి చీఫ్ సెలక్టర్ నాతో చర్చించారు. సమావేశం ముగిసే సమయానికి.. ఇకపై నువ్ వన్డే కెప్టెన్ కాదని ఐదుగురు సెలెక్టర్లు చెప్పారు' అని తెలిపాడు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం (Netizens trolls on Sourav Ganguly) కురిపిస్తున్నారు. 'సౌరవ్ గంగూలీ రాజకీయ నాయకుడే కాదు అబద్ధాలకోరు కూడా' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'గంగూలీ ఇప్పుడు మాట్లాడండి' అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. 'సౌరవ్ గంగూలీ 2001లో టీమిండియా అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్, 2011లో భారత క్రికెట్‌లోని గొప్ప నాయకులలో ఒకరు, 2021లో భారత క్రికెట్‌లోని గొప్ప అబద్ధాలకోరులలో ఒకరు' అని ఓ క్రికెట్ అభిమాని ట్వీట్ చేశాడు. 'గంగూలీ సర్ ఇది చాలా దారుణం', 'సిగ్గు పడండి సర్' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
problem is not removing him from the captaincy but informing him at the last moment. you don't treat your best players like this. pathetic and shameless @BCCI @SGanguly99
— Pr (@deepu_tweetz) December 15, 2021
Sir sir @SGanguly99 😂😂😭
Got exposed very badly 😭😂 https://t.co/p8EZBKcHXA pic.twitter.com/gOtbxuYgzN— Neal Caffrey (@AI_freak) December 15, 2021
2001 : Sourav Ganguly is regarded as one of the greatest white ball batsmen for India
2011 : Sourav Ganguly is regarded as one of the greatest leaders in Indian cricket
2021 : Sourav Ganguly will be considered as one of the greatest liars in Indian cricket pic.twitter.com/Ze3zOOLtjL
— Arnav Singh (@Arnavv43) December 15, 2021
Not only is Sourav Ganguly a politician but also a liar https://t.co/1PIqDU1R1Z
— Arnav Singh (@Arnavv43) December 15, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి