Sourav Ganguly, Ind vs Eng: భారత్‌లోనే ఇండియా vs ఇంగ్లాండ్

England tour in India: భారత్‌లో ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు బిసిసిఐ ( BCCI ) అన్నివిధాల ప్రయత్నిస్తున్నట్టు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) తెలిపారు. అలాగే దేశీ టోర్నమెంట్స్ సైతం జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

Last Updated : Sep 28, 2020, 09:06 PM IST
Sourav Ganguly, Ind vs Eng: భారత్‌లోనే ఇండియా vs ఇంగ్లాండ్

England tour in India: భారత్‌లో ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు బిసిసిఐ ( BCCI ) అన్నివిధాల ప్రయత్నిస్తున్నట్టు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) తెలిపారు. అలాగే దేశీ టోర్నమెంట్స్ సైతం జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సోమవారం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి - మార్చ్ మధ్య కాలంలో ఇంగ్లాండ్ ( England ) భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచులు, మూడు వన్డే ఇంటర్నేషనల్, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడే విధంగా ఇండియా, ఇంగ్లండ్ జట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాయి. Also read : MI VS RCB match news updates: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కరోనా పరిస్థితులను గమనిస్తూనే మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ జరిగేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు గంగూలీ తెలిపారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ కూడా యూఏఈలోనే జరగనుందా అనే సందేహాలపై స్పందిస్తూ.. యూఏఈలో అబు ధాబి, షార్జా, దుబాయ్‌లో మూడు స్టేడియంలు ఉన్నాయని.. అలాగే మనకు కూడా ఇండియాలోనే మ్యాచులు నిర్వహించుకునే విధంగా ముంబైలో సీసీఐ, వాంఖడే, డివై పాటిల్ స్టేడియం, కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలు ఉన్నాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. 

2019-20లో దేశంలో పురుషులు, మహిళలు, అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని ఫార్మాట్స్ కలిపి 2036 మ్యాచ్‌లు నిర్వహించామని చెప్పిన గంగూలీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం బయో బబుల్‌లో ( Bio-bubble ) మాత్రమే మ్యాచులు నిర్వహించాలని.. అన్ని మ్యాచులు అలా నిర్వహించడం సాధ్యపడదని అన్నారు. ఓవైపు యూఏఇలో ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ కోసం జట్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూనే మరోవైపు భారత్‌లో భవిష్యత్‌లో జరగనున్న   Also read : RCB vs MI match Updates: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News