Sunrisers Hyderabad Vs Rajasthan Royals Head to Head Records: ఈ సీజన్‌లో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. వరుసగా రెండు ఓటముల తరువాత టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. రాజస్థాన్ అధికారికంగా ప్లేఆఫ్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఛేజింగ్‌లో తడపడుతున్న ఎస్‌ఆర్‌హెచ్.. టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? హెడ్ టు హెడ్ రికార్డులలో ఎవరిది పైచేయి..? ప్లేయింగ్11లో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..
Also Read: Laxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్ భార్య
పిచ్ రిపోర్ట్ ఇలా..
హైదరాబాద్ ఉప్పల్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా మారింది. మొదట బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటనుండగా.. సెకెండ్ బ్యాటింగ్‌కు స్లోగా మారుతోంది. టాస్ ఎవరు గెలిచినా.. ముందు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపించనున్నారు. ఇక్కడ మొత్తం 71 ఐపీఎల్ మ్యాచ్‌లకు జరగ్గా.. ఆతిథ్య జట్టు 36 మ్యాచ్‌లు గెలుపొందగా.. ప్రత్యర్థి జట్టు 35 మ్యాచ్‌లు గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ హెడ్-టు-హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 18 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ జట్టు 9 మ్యాచ్‌లు, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు ఇలా (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
SRH vs RR Dream11 Prediction:
వికెట్ కీపర్లు: హెన్రిచ్ క్లాసెన్, సంజు శాంసన్
బ్యాటర్స్: ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, జోస్ బట్లర్, జైస్వాల్
ఆల్‌రౌండర్లు: రవిచంద్రన్ అశ్విన్, ఐడెన్ మార్క్రామ్
బౌలర్లు: పాట్ కమిన్స్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ (వైస్ కెప్టెన్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter