T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. రేపు అంటే అక్టోబరు 23న భారత్, పాక్ ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ (Ind vs Pak)కు ముందే పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడైనా షాన్ మసూద్ తలకు గాయమైంది. ప్రాక్టీసులో భాగంగా.. నవాజ్ కొట్టిన షాట్ కు బంతి నేరుగా వెళ్లి మసూద్ తలకు తగిలింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అతడు నొప్పితో విలవిల్లాడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మసూద్ తలకు స్కానింగ్ చేసినట్లు తెలుస్తోంది. రిపోర్టులను బట్టి అతడు టీ20 ప్రపంచకప్ లో ఆడతాడా లేదా అనేది తెలుస్తోంది. గతంలో ఇలాగే ఆసీస్ బ్యాటర్ ఫిలిఫ్ హ్యూజ్ తలకు బంతి తగలడంతో మరణించాడు. రేపటి మ్యాచ్ కోసం ఇప్పటికే పాక్, భారత్ జట్లు మెల్ బోర్న్ చేరుకుని ఫ్రాక్టీసు షురూ చేశాయి.
Shan Masood leaves with ice pack on his face, Nawaz hit a shot & the ball struck Masood. Shan was to play in place of Fakhar Zaman against India. This could be a problem for Pakistan #SportsYaari pic.twitter.com/XK0m180OKL
— Sushant Mehta (@SushantNMehta) October 21, 2022
నేటి నుంచే సూపర్-12 పోరు...
టీ20 ప్రపంచకప్ సూపర్-12 శనివారం నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లు, మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు 7 టీ20 వరల్డ్ కప్ లు జరగగా.. అత్యధికంగా రెండుసార్లు వెస్టిండీస్ (2012, 2016) ట్రోఫీని గెలుచుకుంది. భారత్ (2007), పాకిస్థాన్ (2009), ఇంగ్లాండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి కప్ ను గెలుచుకున్నాయి. ఈమెగా టోర్నీకి ఆసీస్ తొలిసారి అతిథ్యమిస్తోంది. రెండు సార్లు విజేత అయిన విండీస్ ఈ ప్రపంచకప్ లో తొలిదశలోనే ఇంటిముఖం పట్టింది. మరోపక్క మాజీ ఛాంపియన్ శ్రీలంక తొలి రౌండ్లో చిన్న జట్లతో పోటీపడి సూపర్-12కు అర్హత సాధించింది.
Also Read: IND vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే..? ఏం జరుగుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook