Anil Kumble Comments on Ambati: అంబటి రాయుడిని BCCI అవమానపర్చింది: అనిల్ కుంబ్లే

Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2023, 07:24 PM IST
Anil Kumble Comments on Ambati: అంబటి రాయుడిని BCCI అవమానపర్చింది: అనిల్ కుంబ్లే

Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 విజేత చెన్నై సూపర్‌కింగ్స్ ఫైనల్ హీరో అంబటి రాయుడు ఆ మ్యాచ్‌తో మరోసారి చర్చల్లోకొచ్చాడు. తక్కువ స్కోరే అయినా ధాటిగా ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. అది కూడా తన చిట్ట చివరి ఆటలో. అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న అంబటి రాయుడి గురించి అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు ఆలోచించచేస్తున్నాయి. 

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. ధాటిగా ఆడటంలో అంబటి రాయుడు ప్రత్యేకం. జట్టుకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా చేయత అందిస్తుంంటాడు. 2018-19 మధ్యకాలంలో టీమ్ ఇండియాలో వచ్చిన అంబటి రాయుడు అద్భుతంగా రాణించాడు. నాలుగవ స్థానంలో బరిలో దిగినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

ఐపీఎల్ 2023 ఫైనల్‌లో కూడా చెన్నై సూపర్‌కింగ్స్ రిక్వైర్డ్ రన్‌రేట్ బాగా పెరిగి ఒత్తిడిలో ఉన్నప్పుడు కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేసి రిక్వైర్డ్ రన్‌రేట్ తగ్గించగలిగాడు. చెన్నై విజయానంతరం అత్యధికంగా ఆరుసార్లు టైటిల్ అందుకున్న ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన నిలిచాడు. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన మూడు సార్లు, చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ గెల్చిన మూడు సార్లు ఈ రెండు జట్లలో రాయుడు కీలక సభ్యుడు కావడం విశేషం.

 

చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచిన తరువాత ముందుగా ప్రకటించినట్టే అన్ని రకాల క్రికెట్ ఫార్మట్‌లకు వీడ్కోలు పలికాడు. జీవితంలో తన చివరి ఆటనుమరెప్పుడూ మర్చిపోలేనిదిగా చేసుకున్నాడు. ట్యాలెంట్ ఉన్నా టీమ్ ఇండియాలో సరైన గుర్తింపుకు నోచుకోని క్రికెటర్ అంబటి రాయుడు అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. బీసీసీఐ నుంచి అంబటి రాయుడికి ఎప్పుడూ సరైన గౌరవం దక్కలేదు. 

Also Read: Team India New Jersey: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కొత్త జెర్సీలో టీమిండియా.. లాంచింగ్ వీడియ్ చూశారా..!

2018-19లో రాణించిన అంబటి రాయుడిని కచ్చితంగా 2019 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారనే అంతా భావించారు. కానీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాత్రం అంబటిని పక్కనబెట్టి విజయ్ శంకర్‌ను ఎంపిక చేసింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన అంబటి రాయుడు అప్పట్లో బహిరంగంగానే బీసీసీఐపై విమర్శలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా టీమ్ ఇండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్‌‌లో భాగమయ్యాడు. ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. 

అంబటికి బీసీసీఐ అన్యాయం చేసింది-అనిల్ కుంబ్లే

అంబటి రాయుడు వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్‌కు ఆడాల్సిందే. రాయుడిని తప్పించి జట్టు మేనేజ్‌మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలు రాయుడిని నాలుగో స్థానం కోసం 6 నెలల పాటు సిద్ధం చేశారు. కోహ్లీ సపోర్ట్ చేసినా ఎందుకో మరి ఆ తరువాత స్థానం లేకుండా పోయింది. ఇది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే...అంటూ అనిల్ కుంబ్లే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

రాయుడికి వెన్నంటి నిలిచిన విరాట్ కోహ్లి

టీమ్ ఇండియా జట్టుకు 4వ స్థానానికి పరిష్కారంగా నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి..అంబటి రాయుడిని సిద్ధం చేశాడు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 మార్చ్ వరకూ ఆరు నెలల పాటు 4వ స్థానంలో రాయుడిని బలోపేతం చేశాడు. ఈ ఆరు నెలల కాలంలో రాయుడు కూడా 21 వన్డేలు ఆడి..639 పరుగులు చేశాడు. ఇందులో1 సెంచరీ 4 అర్ధ సెంచరీలున్నాయి. 

Also Read: Asia Cup 2023: సందిగ్దంలో ఆసియా కప్ నిర్వహణ, పాక్ నుంచి మారనున్న వేదిక

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News