Billion Cheers Jersey: ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న టీ-20 ప్రపంచ కప్పు (T-20 World Cup) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. యూఏఈ (UAE) వేదికగా జరుగునున్న ప్రపంచ కప్ సమరంలో పాల్గొనటానికి ఇప్పటికీ అన్ని దేశాల జట్లు అక్కడకి చేరుకున్నాయి. అయితే ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ యూఏఈలో జరుగుతన్న కారణంగా మన భారత ఆటగాళ్లు కూడా అక్కడే ఉన్నారు.
ఐసీసీ క్రీడోత్సవం (ICC) ఆదివారం మొదలుకానున్న కారణంగా ఈ రోజు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ టీ-20 వరల్డ్ కప్ (T 20 World Cup) లో ధరించబోయే కొత్త జెర్సీలను (New Jersey) ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. టీమిండియా (Team India) ధరించే పాత జెర్సీలతో పోలిస్తే ఇపుడు విడుదల చేసిన జెర్సీ కలర్ కొంచెం వత్తుగానే ఉంది. మెన్ ఇన్ బ్లూ (Men In Blue) అనుకున్న జెర్సీ కలర్ థిక్ బ్లూ కలర్ గా మారిపోయింది. బీసీసీఐ (BCCI) పోస్ట్ చేసిన కొత్త జెర్సీల ఫోటోలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virak Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), బుమ్రా (Bhumra)ఉన్నారు.
అభిమానుల బిలియన్ చీర్స్ ప్రేరణ (Billion Cheers Jersey) పొంది మరియు అందుకు అనుగుణంగానే ఈ జెర్సీ డిజైన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ కొత్త జర్సీలతో టీ-20 వరల్డ్ కప్ టీమిండియా ఆడనుంది. కొత్త జెర్సీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది సమయానికే వైరల్ అవ్వగా.. పెద్ద ఎత్తున టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
Presenting the Billion Cheers Jersey!
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
— BCCI (@BCCI) October 13, 2021
టీమిండియాపై కొత్త స్పాన్సర్ గా ఎంపీఎల్‌ను ఎంచుకుంది.. ఇది వరకు నైక్ ఉన్న కాంట్రాక్ట్ ముగిసిన విషయం మనకు తెలిసిందే.. స్పాన్సర్ వచ్చిన ఎంపీఎల్ భారత ఆటగాళ్లకు కొత్త కిట్ లను అందించింది.
Also Read: Special Poster from Radhe shyam: హ్యాపీ బర్త్ డే పూజ.. స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన రాధేశ్యామ్
టీ-20 ప్రపంచ కప్పు లో 12 సూపర్ మ్యాచ్ లు ఉండగా.. ఇవి ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్నాయి. భారత్ తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో అక్టోబర్ 24 ఆడనుంది. ఇప్పటికే ఈ టికెట్లు అమ్మకం అయిపోగా.. రెండో మ్యాచ్ న్యూజిలాండ్ తో అక్టోబర్ 31 ఉండగా... వంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌తో ఆడనుంది. తరువాత క్వాలిఫయర్ లో గెలిచిన టీమ్ లతో మరో రెండు మ్యాచ్ లు నవంబర్ 5,8 తేదీల్లో జరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి