Rihit Sharma shocking Decisions: రోహిత్ శర్మ... టీమిండియా సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా నియామకం అయిన వెంటనే జట్లు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియాలో ఒకేసారి ఇన్ని మార్పులని చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాటింగ్ లో దూకుడుగా సత్తా చాటే రోహిత్ శర్మ... కెప్టెన్సీ విషయంలో కూడా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా నియమించిన వెంటనే ఇషాంత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, వృద్ధిమాన్ సాహాలను శ్రీలంక సిరీస్ నుంచి తప్పించారు. నలుగురి దిగ్గజ క్రికెటర్లను ఒకేసారి జట్టు నుండి తప్పించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పుజారా, రహానే కలిసి భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించారు. వీరి స్థానంలో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు చోటు దక్కటం విశేషం.
కొత్త వాళ్లకి అవకాశం..
కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వటంలో రోహిత్ శర్మ ఎప్పుడు ముందుంటారు. వెస్టిండీస్ తో జరిగిన సీరీస్ లో ఓపెనింగ్ కి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పంపించటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా, వెస్టిండీస్ మరియు శ్రీలంకతో జరిగిన T20 సిరీస్‌లో ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్ కి పంపించటం కూడా క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇలా యంగ్ స్టార్స్ కి అవకాశాలు ఇవ్వటం ద్వారా కొత్త కొత్త ప్రయోగాలతో వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేపనిలో పడ్డాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అదనపు ఓపెనర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు మన టీమిండియా కెప్టెన్.
స్పిన్ పిచ్ పై అద్భుతాలు
మన దేశంలోని పిచ్ లు ఎల్లపుడు స్పిన్ బౌలర్ లకి అనుకూలంగా ఉంటాయి. భారత స్పిన్ బౌలర్లు ఆతిధ్య జట్టును కట్టడి చేయటంలో ముఖ్య భూమికను పోషిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్ కి బదులుగా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చాడు. బౌలింగ్ చేసిన తొలి మ్యాచ్ లోనే 3 వికెట్లను తీసిన వాషింగ్టన్ సుందర్ ఇపుడు జట్టులో కీలక బౌలర్ గా మారాడు. అంతేకాకుండా, రెండో మ్యాచ్ లో కూడా పరుగులు తక్కువ ఇవ్వటమే కాకుండా, బ్యాటింగ్ లోను రాణించి 24 పరుగుల వరకు చేసాడు. మొదట రోహిత్ శర్మ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ, రోహిత్ నిర్ణయమే సరైనది నిరూపితమైంది.
మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా..
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇపుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించబడిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్, న్యూజిలాండ్ మరియు శ్రీలంకపై జట్లను క్లీన్ స్వీప్ చేసింది. బౌలింగ్ లో, బ్యాటింగ్ లోనూ మార్పులను చేస్తూ.. నిర్యాయాలు తీసుకోవటంలో అత్యుత్తమ కెప్టెన్‌గా మారాడు.
Also Read: Mahindra university: ఇండియాలో మెడికల్ కాలేజీల కొరతపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Also Read: Ajith New Look: స్టైలిష్ లుక్‌లో అజిత్.. ఆ సినిమా కోసమేనా?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook