IPL 2020: వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ-అనుష్కల రోమాన్స్ ఫోటో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో వరుస విజయాలు సాధిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సాయం సంధ్యవేళ నీళ్లలో దిగిన ఈ జంట ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Last Updated : Oct 19, 2020, 06:49 PM IST
IPL 2020: వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ-అనుష్కల రోమాన్స్ ఫోటో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( IPL 2020 ) లో వరుస విజయాలు సాధిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) భార్యతో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సాయం సంధ్యవేళ నీళ్లలో దిగిన ఈ జంట ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

యూఏఈ ( UAE ) లో ఐపీఎల్ 2020లో ఇప్పుడందరి దృష్టీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Team india captain Virat kohli ) ,  అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) లపైనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా యూఏఈలో అనుష్కతో కలిసి విరాట్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అదే విధంగా దుబాయ్ లో ఓ సాయం సంధ్య వేళ..నీళ్లలో భార్యతో కలిసి దిగిన ఫోటో..ఈ ఇద్దరి రోమాన్స్ కు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఫోటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. 

సాయంత్రం సంధ్య వేళ.. లేలేత నారింజవర్ణంలో కన్పిస్తున్న సూర్య కిరణాలు నీటిపై పడి ప్రతిబింబాలుగా కన్పిస్తున్న తరుణంలో..విరాట్ కోహ్లీ - అనుష్కలు భుజాల్లోతు  నీళ్లలో దిగి..ఒకరినొకరు చూసుకుంటూ రోమాన్స్ లో మునిగిన దృశ్యాన్ని సహచర ఆటగాడైన ఏబీ డి విలియర్స్ క్లిక్ మన్పించాడు. ఈ ఇద్దరు వెనుక అందమైన కోట ఠీవిగా కన్పిస్తోంది. ఈ ఫోటోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ.. పిక్ క్రెడిట్ ఏబీ డివిలియర్స్ ( AB De villiers )‌ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఫోటో పోస్ట్ చేసిన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు కురిపించేస్తున్నారు. క్యూట్ కపుల్, కోహ్లీ - అనుష్క సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

2013లో ఓ ప్రకటనలో మొదలైన ఈ ఇద్దరి ప్రేమ నాలుగేళ్ల పాటు సాగి..2017 డిసెంబర్ 11న బంధమైంది.  ప్రస్తుతం అనుష్క గర్భవతిగా ఉంది. వచ్చే యేడాది జనవరిలో డెలివరీ డేట్ ఉంది. 

ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ( IPL Title ) సాధించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు..ఈసారి బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం ఆడిన 9 మ్యాచ్ లలో ఆరింట గెలిచి 12 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో నిలిచింది. ప్రారంభ మ్యాచ్ లలో తడబడిన విరాట్ కోహ్లీ..అనంతరం పుంజుకోవడం విశేషం. Also read: KXIP vs MI Super Over: పాత రూల్ ఉంటే విజయం ఎవరిది? రెండో సూపర్ ఉండదు

 

Trending News