Ravichandran Ashwin: టీమ్ ఇండియా మాజీ రధ సారధి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి క్రికెటర్ ఫాఫ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కెప్టెన్సీ లేకపోవడం ఒక బ్రేక్ మాత్రమే అంటున్నాడు.
టీమ్ ఇండియా ఆటగాడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ..మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయా..టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ దిశలో వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. 2013 నుంచి పూర్తి స్థాయిలో ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ..టైటిల్ గెలవకుండానే సారధ్య బాధ్యతల్నించి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2021లో కెప్టెన్సీ బాథ్యతల్నించి తప్పుకున్నాక..దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్నుసారధిగా ఎంపిక చేసింది ఆర్సీబీ.
ఈ విషయంపై టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కెరీర్ ప్రస్తుతం ముగింపుకు చేరుకుందని..మరో 2-3 ఏళ్లు ఆడతాడేమో అని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ఫాఫ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని..అతడి అనుభవం జట్టుకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. తనలో కూడా కెప్టెన్సీ నైపుణ్యాలున్నాయని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారంతో ఒత్తిడికి గురవుతున్నాడని..కొద్దిగా విశ్రాంతి అవసరమన్నాడు. అందుకే విరాట్ కోహ్లీపై సారధ్య బాధ్యతలు లేకపోవడం కేవలం ఒక బ్రేక్ మాత్రమేనని..2023లో తిరిగి ఆర్సీబీ కెప్టెన్ అవుతాడని అంటున్నాడు.
Also read: Virat Kohli Join RCB: ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతానని అనుకోలేదు: కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook