West Indies vs India 3rd ODI: కరేబియన్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన మూడో వన్డేలో సునాయాస విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 119 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా జట్టు క్లీన్ స్వీప్ చేసినట్లయింది. తొలి రెండు వన్డేల్లో గట్టి పోటీనిచ్చిన విండీస్ జట్టు మూడో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది.
ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భారత్‌కు శుభారంభనిచ్చారు. 7 ఫోర్లతో 58 (74) పరుగులు చేసిన శిఖర్ ధావన్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 22.5 ఓవర్లలో 113గా ఉంది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్-శుభ్‌మన్ గిల్ జోడీ 86 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు.
సంజు శాంసన్-శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడుతున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికీ టీమిండియా స్కోర్ 36 ఓవర్లలో 225/3గా ఉండగా.. శుభ్‌మన్ గిల్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ఉన్నాడు. వర్షం నిలిచిపోయాక అంపైర్లు వెదర్ కండిషన్ కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకటించారు. దీని ప్రకారం విండీస్ జట్టుకు 35 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విండీస్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఇంకా ఖాతా తెరవకుండానే 2 వికెట్లను కోల్పోయింది.యజువేంద్ర చాహల్ 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్‌తో రాణించడంతో విండీస్ జట్టు 26 ఓవర్లలో కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేదు. విండీస్‌తో ఈ విజయంతో టీమిండియా వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్లయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. ఈ రెండు అవార్డులు శుభ్‌మన్ గిల్‌నే వరించాయి.
Also Read: Bimbisara: రాజ్యకాంక్షతో రగిలిపోతున్న బింబిసారుడు.. ఒక్కసారిగా అంచనాలు పెంచారుగా!
Also Read: Horoscope Today July 28th : నేటి రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారు ఇవాళ చాలా సంతోషంగా ఉంటారు...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook