Sourav Ganguly about Virat kohli: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ఎడిషన్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరి అలాంటిది ఈ ఇద్దరినీ టీట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపిక చేస్తే ఏం జరుగుతుంది అనే దానిపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తొలిసారిగా స్పందించారు. ముఖ్యంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై భారత అభిమానులు ఎన్నో సందేహాలు లేవనెత్తుతున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో కేవలం 16 రన్స్ యావరేజ్‌తో 128 పరుగులు చేశాడు. ఏ ఐపీఎల్ సీజన్‌లోనూ కోహ్లీ నుంచి ఇలాంటి పేలవమైన ఆటతీరు చూడలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో గతంలోనూ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2014లో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో పరుగులు చేయలేక గడ్డు పరిస్థితులను చవిచూశాడు. కానీ ఆ తర్వాత సంవత్సరమే ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు సాధించి.. తన సత్తా ఎంటో నిరూపించాడు. సరిగ్గా ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కచ్చితంగా కోహ్లీ తన మనసులో ఏమున్నా.. అవన్నీ పక్కనబెట్టి ఓవర్ కమ్ అవుతాడని స్పష్టం చేశాడు. కోహ్లీ ఒక్కడే కాదు.. ముంబై ఇండియన్స్, భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఎంతో నమ్మకంగా ఉన్నట్టు చెప్పాడు.
రోహిత్ శర్మ ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడితే కేవలం 153 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 216 మ్యాచులు ఆడిన కోహ్లీ 36.43 యావరేజ్‌తో 6411 పరుగులు చేశాడు. ఇందులో 42 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. నిజంగానే సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) నమ్మకాన్ని విరాట్ కోహ్లీ నిలబెడుతాడా.. లేక ఇదే చెత్త ప్రదర్శన కంటిన్యూ చేస్తాడా వేచి చూడాలి మరి.
Also read : Arshdeep Singh Death Over Bowling: అర్షదీప్ సింగ్.. డెత్ ఓవర్ బౌలింగ్ ఎక్స్‌పర్ట్
Also read : Robin Singh backs Rohit Sharma: కష్టకాలంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు రాబిన్ సింగ్ మద్దతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.