WTC Final Reserve Day: రిజర్వ్ డే నాడు సౌతాంప్టన్‌లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా, విజేతను ఇలా ప్రకటిస్తారు

WTC Final Reserve Day Weather Report: వరుణుడి కారణంగా ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండు రోజుల ఆట వర్షార్పణమైంది. ఐసీసీ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు రిజర్వ్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాతావరణం ఆడేందుకు అనుకూలమని సమాచారం.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 23, 2021, 02:54 PM IST
  • రిజర్వ్ డే నాడు సౌతాంప్టన్‌లో వాతావరణం ఎలా ఉంటుందో
  • నేడు రిజర్వ్ డే మ్యాచ్ జరుగుతుందా, ఫలితం ఎలా ఉండనుంది
  • డ్రా అయినా, టై అయినా టీమిండియా, న్యూజిలాండ్‌లు సంయుక్త విజేతలు
WTC Final Reserve Day: రిజర్వ్ డే నాడు సౌతాంప్టన్‌లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా, విజేతను ఇలా ప్రకటిస్తారు

WTC Final Reserve Day: అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరుణుడి కారణంగా సజావుగా ఐదు రోజులపాటు ఆట సాగలేదు. నేడు రిజర్వ్ డే మ్యాచ్ జరుగుతుందా, ఫలితం ఎలా ఉండనుంది అనే అంశంపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమైంది. 

వరుణుడి కారణంగా ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండు రోజుల ఆట వర్షార్పణమైంది. ఐసీసీ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు రిజర్వ్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాతావరణం ఆడేందుకు అనుకూలమని సమాచారం. నేడు సౌతాంప్టన్‌లో వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. అయితే విజయం సాధించడానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో టీమిండియా (Team India), న్యూజిలాండ్ రెండు జట్ల ఆటగాళ్లు విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుం టీమిండియా 2 వికెట్ల నష్టానికి 64 పరుగుల ఓవర్‌నైట్‌తో బ్యాటింగ్‌కు దిగనుంది.

Also Read: WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగా, కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం ప్రత్యర్థి కివీస్‌కు లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లిద్దరూ వికెట్ల ముందు దొరికిపోయారు. రోహిత్ శర్మ(30), శుభ్‌మన్ గిల్(8)ని కివీస్ పేసర్ టిమ్ సౌథీ ఔట్ చేశాడు. ప్రస్తుతం చతేశ్వర్ పూజారా (12 నాటౌట్), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ () (8 నాటౌట్) క్రీజులోకి దిగాల్సి ఉంది.

Also Read: WTC Final: పక్షిలా ఎగురుతూ Shubman Gill స్టన్నింగ్ క్యాచ్, రాస్ టేలర్ ఔట్ Viral Video

ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా, టై అయినా టీమిండియా, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. కివీస్ విజయం సాధించాలంటే భారత్‌ను ఆలౌట్ చేసి ఆ పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ సేన ఐసీసీ తొలి డబ్ల్యూటీసీ (WTC Final 2021) విజేతగా నిలవాలంటే.. టీమిండియా చేసే పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలి. భారత్ విసిరిన లక్ష్యాన్ని చేరుకునేలోగా కివీస్ జట్టును ఆలౌట్ చేయాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News