Hyderabad Metro Timings During Telangana Lockdown: తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 9వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల టైమింగ్స్ సవరించారు.
మూసాపేట మెట్రో స్టేషన్ పగుళ్లకు (Cracks to Moosapet Metro Station) సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మూసాపేట మెట్రో గోడల పగుళ్లను సిమెంట్‌తో పూడ్చేశారు.
Hyderabad Metro Rail New Timings | కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు నేటి (సెప్టెంబర్ 7న) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి.
Hyderabad Metro Rail New Timings | ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.
హైదరాబాద్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ప్రాంతాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడం కోసం మరియు మైట్రోరైలు పనులు, స్కైవే పనులకు అంతరాయం తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్‌లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం నుండి ఎల్బీ నగర్చౌరస్తాను బంద్ చేసి ఎల్పీటీ మార్కెట్, డీమార్ట్‌ల ముందు యు టర్న్‌లు తెరవడానికి ఏర్పాటు చేస్తున్నారు.
భాగ్యనగరంలో మెట్రో రైలు పట్టాలెక్కే మూహుర్తం ఖరారైంది. నవంబర్ నెలలో ప్రధాని చేతుల మీదుగా మోట్రో రైలు ప్రారంభించాలని టి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ గురువారం లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.